శుక్లాం బరధర్మం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే !! అని, ఏ శుభకార్యం తలపెట్టినా గణపతిని సర్వవిఘ్న నివారణ నిమిత్తం తలవని వారుండరు. ప్రతికార్యారంభంలోనూ-ప్రతి కావ్యారాంభంలోనూ ఈ స్తుతి పఠించి- సందర్భాన్ని బట్టి గణపతి పూజ చేసి ఆ తరువాతనే ఆయా కార్యాలు చేయడం పరిపాటి, అదీగాక – భాద్రపద శుక్ల చవితి రోజున, ఏడాది కొకసారి గణపతి జన్మదినాన్ని పురష్కరించుకుని వినాయక చవితి పండగ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. వినాయక చతుర్థిగా కూడా వ్యవహరించుబడే ఈ పర్వానికి వినాయక పూజ ముఖ్యంగా చేసితీరాలి. భాద్రపద శుద్ధ చవితినే గణేశ్ చతుర్థిగా జరుపుతారు. వినాయకుని ప్రత్యేకతలు : వినాయకుడు తన భక్తులను త్వరగా అనుగ్రహించి, సుఖసంతోషాలను ప్రసాధిస్తాడు. వినాయకుడు సస్యకారకుడు, మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించిన అనంతరం పొలాల్లో ఉంచితే సస్యశ్యామలమవుతామని ప్రతీతి. గణనాదుడు సఫలత్వ శక్తికి అధిష్ఠానదేవత. కనుక తొలిపూజలందే వేల్పుగా గుర్తించారు. అలా చేయడం వల్ల తల పెట్టిన కార్యాలు ఫలవంతమై సకల సౌభాగ్యలు పొందగలుగుతారు. గణనాధునికి కొబ్బరి నూనెతో దీపారాధన శ్రేష్ఠం. వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ల, లడ్లు, చెరుకుగడలు, అరటిపండ్లు. నారికేళ (కొబ్బరి) ఫలాలు, మాధీఫలాలు, గారెలు, అప్పములు, ప్రీతికరమైనవి.

మరింత సమాచారం తెలుసుకోండి: