తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. స్నేహపూర్వక, సౌఖ్యవంతమైన స్వేచ్ఛను పిల్లలకు కల్పించాలి. విలువలకు, లక్ష్యాలకు చక్కటి రూపాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులే కీలకం. లక్ష్యాలు వాస్తవికతకు అద్దంపట్టేటట్లుగా ఉండాలే తప్ప అద్బుతంగా ఉండకూడదు.పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి. ప్రతి తల్లితండ్రులు యొక్క భాద్యత పిల్లల పెంపకం. పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

 

జీవితంలో అనుక్షణం ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడంలో పిల్లలకు నైతిక విలువలతో కూడిన మార్గదర్శకత, తగు శిక్షణలను అందించాలి..ఎంతసేపు చదువు కాకుండా పిల్లలకు ఇష్టం అయినవి చేయాలి. తిండి విషయంలో పిల్లల్ని వారి స్నేహితులతో  పోల్చవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల స్నేహితులు ఎలాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది.

 

పిల్లలకు కావలసినది  ఆహారం, నీరు, నీడ కాకుండా ఇంకొన్ని అవసరాలున్నాయి. తమతో అందరూ మాట్లాడాలని, తమ కోరికలు, ఆశలు, సమస్యలు తీర్చాలనీ కోరుకుంటారు.  ప్రతిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మాట్లాడాలి.   స్నేహితులు కావాలని కోరుకుంటారు. స్నేహితులవల్ల వారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. తమ ఇష్టాయిష్టాలకు తగ్గ  వ్యక్తులను స్నేహితులుగా కోరుకుంటారు.మీ పిల్లలతో కాలం గడపండి.. వారానికి ఒక్కసారి అయినా అలా సరదాగా కుటుంబంతో బయటకు వెళ్ళండి. పిల్లల ఇష్టాల్ని అడిగి తెలుసుకోండి.వీలయినంత సేపు పిల్లలతో గడపండి. కలిసి భోజనం చేయండి. ఫ్యామిలీ ట్రిప్స్ కి బయటకి వెళ్ళండి. 

 

''చెడు సావాసం చెరుపు'' అనేది సామెత.  అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాన్ని అతి చేరువతో గమనించాలి. తమకు 'గుర్తింపుకావాలని' పిల్లలు కోరుకుంటారు. ఒక పిల్ల / పిల్లవాడు  వేరొకరితో భిన్నంగా ఉంటారు. పిల్లలందరూ వారి వారి మనోభావాలను ననుసరించి భిన్న లక్షణాలను  వ్యక్తపరుస్తారు.  తమ పిల్లల్లో గల అటువంటి అంశాన్ని గమనించి సరైన రీతిలో ప్రోత్సహించాలి.వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయండి. మీ ఇష్టాలని వాళ్లపై రుద్దకండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: