మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినా దాన్ని భరించగలం. కానీ పిల్లలకు ఏదైనా అనారోగ్యం ఉంటే చూడడం చాలా కష్టంగా ఉంటుంది .ఈ రోజుల్లో దగ్గు వస్తే ఒక పట్టాన తగ్గటం లేదు. ఎన్ని కాఫ్ సిరప్ లు వాడినా ఏమాత్రం ప్రయోజనం ఉండట్లేదు అని తల్లితండ్రులు చాలా బాధ పడుతూ ఉంటారు.అందులోను చిన్నపిల్లలు కదా ఏమి చెప్పలేరు. దగ్గు దగ్గలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఈ చిన్న చిట్కాతో మీ చిన్నారుల దగ్గు పూర్తిగా నయమవుతుంది .ఒక్కొక్కరు ఒక్కొక్కటి  చెబుతున్నారు అని దీనిని ఈజీగా తీసుకోకండి. ఇది చేయడం చాలా సింపుల్ వెంటనే తగ్గిపోతుంది.పిల్లలు కూడా చాలా రిలీఫ్ గా ఉంటారు. 

 

పిల్లలు తాగేందుకు కూడా పెద్దగా ఇబ్బంది పడరు. ముందుగా ఒక అంగుళం పొడవు అల్లం ముక్కను తొక్క తీసి శుభ్రంగా కడిగి దాన్ని దంచి పెట్టుకోండి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగాక దంచి పెట్టుకున్న అల్లాన్ని కలిపి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించండి .ఆ గ్లాస్ అల్లం వాటర్ ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇవ్వండి. ఒక్కరోజులోనే దగ్గు తగ్గిపోతుంది .కానీ మూడు రోజులపాటు ఇస్తే దగ్గు, జలుబు లాంటివి మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి. సాధారణంగా పిల్లలకు అది తాగాలంటే పెద్దగా ఇబ్బందిగా కూడా ఏమీ ఉండదు. కొంచెం ఘాటుగా ఉంటుంది. వాళ్ళు తాగ లేకపోతే కొంచెం తేనె కలిపి ఇవ్వండి.

 

అలాగే బిడ్డ దగ్గు సహజంగా తగ్గించాలంటే ఈ చిట్కా బాగా పని చేస్తుంది. ముక్కు అడ్డంకి తొలగించి బిడ్డ తేలికగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. గొంతుకు ఈ మిశ్రమం ఊరట కలిగిస్తుంది. బాక్టీరియాను చంపేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, వేడి నిమ్మరసం కొద్దిగా కలిపి బిడ్డకు తాగించండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: