పిల్లలు పక్క తడుపుట మామూలే. కానీ అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక చాలామంది డైపర్ వేస్తూ ఉంటారు. బయటికి వెళ్లేటప్పుడు డైపర్ వేయడం తప్పులేదు కానీ, రోజంతా డైపర్ వేసి ఉంచడం వలన పిల్లలకు ర్యాషెస్ వస్తుంటాయి. పాపం దురద మంట పిల్లల్ని వేధిస్తుంటాయి.వాళ్ళు బయటకు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. మనమే పిల్లల బాధ అర్ధం చేసుకోవాలి. అయితే డైపర్లు వేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. 

 

డైపర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సేఫ్టీ కోసం వాడే డైపరే డేంజర్గా మారి... పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు రావడం ఖాయం. అందుకే డైపర్లు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.డైపర్ వేసేటప్పుడు చర్మం తడిగా లేకుండా చూడాలి. కొద్దిగా పౌడర్ రాసి ఆ తర్వాత డైపర్ వేయండి.

 

డైపరే కదా అని అలా వదిలేయకండి. తరచూ చెక్ చేయండి. పాస్ పోసిన, మల విసర్జన చేసిన వెంటనే తీసి శుభ్రం చేయండి. అలాగే తీసేసిన డైపర్ ఒక కవర్ లో పెట్టి దూరంగా పారేయండి. పిల్లలకు అందుబాటులో ఉంచకండి. కాసేపు అలా వదిలేసి ఒళ్ళు ఆరిన తర్వాతే డైపర్ వేయండి.డైపర్ మామూలుగా తోడిగేస్తూ వుంటారు చాలామంది. కొన్ని సార్లు కొన్ని డైపర్ల వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉండదు అనే విషయం గమనించరు. మరీ టైట్గా ఉన్న, మెటీరియల్ కంఫర్ట్ గా లేకపోయినా పిల్లలు ఇబ్బంది పడటమే కాదు చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

 

 

 

 ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ తో కానీ, కొబ్బరి నూనెతో కానీ మసాజ్ చేసి వేడి నీటితో కడిగేయండి. తరచూ అలా చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి.అన్నింటికన్నా ఉత్తమం ఏమిటి అంటే... బయటికి వెళ్లేటప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకండి. కాస్త గాలి తగులుతూ ఉండడం చాలా అవసరం. పిల్లలకు కూడా హాయిగా అనిపిస్తుంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: