తల్లితండ్రులు పిల్లల్ని మందలించవచ్చు. కానీ అది శృతిమించితే పిల్లల మనసు చాలా గాయపడుతుంది. మనం చెప్పేది ఏదన్నా పిల్లలకు నిదానంగా చెప్పాలి. అంతేగాని ఎదో డిమాండింగ్ చేసినట్లు, కోపగించుకున్నట్లు చెప్పకూడదు. ఐదు నిమిషాల్లో స్నానం చేసొచ్చి కూర్చుని చదువుకోకపోతే కంట్లో కారం పెడతాను" అన్నది దండనైతే, "తొందరగా స్నానం చేసొచ్చేయి.అప్పటిదాకా నువ్వేం నోట్స్ రాసావో చూస్తాను" అన్నది క్రమశిక్షణ. రెండో దాంట్లో తను బాధ్యతగా పాల్గొనటం కూడా ఉంది. శరీరంపై అధికారాన్ని ప్రదర్శించడం దండన, చక్కటి జ్ఞానాన్ని పెంపొందించడం క్రమశిక్షణ.క్రమశిక్షణలో పెట్టడం మంచిదే కానీ అది మరి శృతిమించితే మాత్రం అనర్ధం అవుతుంది.. మీ పిల్లల్ని కొట్టో లేక తిట్టో మీరు క్రమశిక్షణలో పెట్టాలనుకుంటారు.. కానీ ఆ దండన అనేది పిల్లవాడిని మనసుని భయబ్రాంతులకు గురిచేస్తుంది.. మీ పిల్లలు మిమ్మల్ని చూసి భయపడతారు తప్ప మీదగ్గరకు ప్రేమగా రారు అలాగే మాట్లాడారు కూడా.. 

 

పిల్లల్ని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లడంతో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. కనీసం వారానికి ఒక సాయంత్రమైనా వారితో కూర్చుని టీవీ చూస్తూ ఉండడం కాదు. కనీసం ఒకరోజయినా  వారితో కమ్యూనికేట్ చేయడం కనీసబాధ్యత. తల్లిదండ్రులు తమకిచ్చే టైమ్ ని అపురూపంగా భావిస్తారు పిల్లలు.తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకర్నొకరు చులకన చేసుకోకపోవడమే వారి బాల్యానికి వారిచ్చే గొప్ప బహుమతి.

 

తమని వారు ఎంత బాగా చూసుకుంటున్నారనేదానిపై పిల్లల భద్రతభావం ఆధారపడి ఉంటుంది. పిల్లల ముందు నిరంతరం కలహించుకునే తల్లిదండ్రులు, పిల్లల్లో విపరీతమైన అభద్రతాభావాన్ని పెంచుతారు. కనీసం వారికోసమైనా తమ ప్రవర్తన మార్చుకోవాలి. అలా అని అడిగిన ప్రతీదీ ఇవ్వటం గారాబం క్రింద వస్తుంది. చిన్నప్పుడు తాను అనుభవించలేనిది తన పిల్లలు అనుభవించాలి అన్న కోరిక అన్నివేళలా మంచిది కాదు.మనకు ఉన్నదానితో సర్దుకుపోవాలి అన్నా భావనతో పిల్లలకి చెప్పాలి.వాళ్ళకి ఏది మంచో ఏది చెడో అన్నది మీరే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: