ఇప్పుడు ప్రతి తల్లితండ్రులు చెప్పే మాట ఒకటే.మ పిల్లవాడు ఎదుగుదల సరిగా లేదు అని. అయితే పిల్లల ఎదుగుదలకు ఐరన్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలు చాలా అవసరం. ఈ పోషకాలన్నీ బెల్లంలో పుష్కలంగా లభిస్తాయి. అలాగే రోజువారీ ఆహారంలో భాగంగా బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా అవ్వడంతోపాటు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి.అసలు బెల్లం పెట్టడం వల్ల పిల్లలకు ఎటువంటు ప్రయోజనాలు ఉన్నాయో చుడండి.

 

 

బెల్లం ఆహారపదార్థాలకు రుచినివ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలకి మంచి ఔషధం. దీనిలోని పోషకాల వల్ల పిల్లల్లో రక్తహీనత, జీర్ణ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్‌ అధికంగా లభిస్తుంది. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. అలాగే బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిలోని మినరల్స్‌ జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్స్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. దానివల్ల పిల్లలకి మలబద్ధకం సమస్య రాదు.

 

 

 

బెల్లాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేయడంవల్ల పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి కావలసిన క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు మెండుగా అందుతాయి. అంతేకాదు బెల్లంలో వ్యాధినిరోధక శక్తికి తోడ్పడే యాంటాక్సిడెంట్లు, సెలీనియం, జింక్‌ వంటి న్యూట్రిషన్స్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల పిల్లల్లో ఫ్లూ, జలుబు వంటి వాటిని తగ్గించడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే ఔషధం. అందుకే బెల్లం తీసుకుంటే మంచిది కదా అని ఎక్కువగా తినకూడదు. అందుకని పిల్లలకు రోజూ ఆహారంలో కొద్ది పరిమాణంలో ప్రతిరోజూ పెట్టాలి.పిల్లలలో రక్తహీనత అలాగే ఎదుగుదల లోపాలు ఎమన్నా ఉంటే పోతాయి. అలాగే పిల్లలు కూడా బెల్లంను బాగా ఇష్టపడి తింటారు కనుక కనీసం రోజుకు ఒక్కసారి అయిన కొంచెం బెల్లం పెట్టండి. బెల్లంతో చేసిన వంటకాలు పిల్లలకి ఎక్కువగా పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: