పిల్లవాడు తరచూ అబద్దాలు చెప్తున్నాడంటే అది పెద్దలకు ఒక హెచ్చరిక. సమయంలో పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చిన్న పిల్లవాడు కదా తెలియక చెబుతున్నాడు అని వదిలేస్తే పెద్ద అయ్యాక అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోతుంది.. ఒక పిల్లవాడికి 8 నుండి 9  సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నిజానికి, ఊహకు మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం కొంచం కష్టంగానే ఉంటుంది. నిజమేదో గ్రహించలేక నిజం నుండి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. సరిగ్గా గమనిస్తే, ఆ సమయంలోనే వారు మనకు ఎన్నో సృజనాత్మక అసత్యాలు చెప్తారు..

 

 

 

కుటుంబంలో చిన్నవాళ్లైనా ఈ పిల్లల మాటలు ఎవరు వినిపించు కోకపోయినా, కుటుంబ సమస్యలతో పెద్దలు సతమతమౌతూ, పిల్లల గురించి పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు అసత్యాలు చెప్తారు.అలాగే తల్లితండ్రులు పిల్లల విషయంలో మరి కఠినంగా వ్యవహరించకూడదు. ఒక్కోసారి తల్లి తండ్రులు కొడతారనే భయంతో ఏదన్నా తప్పు చేస్తే దాన్ని కవర్ చేయడానికి అబద్దాలు చెప్తారు. ఇలా అబద్దం చెప్పినపుడు  పిల్లవాడిని నిజానికి దగ్గరగా తీసుకుని  మంచిదో చెడు ఎదో చెప్పడం  చాలా ముఖ్యం. లేకుంటే పెద్దలను మోసగించానని, పిల్లవాడు మరింత ప్రోత్సాహం పొందుతాడు. అబద్దాన్ని విస్మరించడం అంటే దానిని ప్రోత్సహించడమే. 

 

 

పెద్దల దృష్టిని కోరుకునే పిల్లల విషయంలో మనం ఆ పిల్లలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లవాడు తాను చేసిన ఏదైనా తప్పు నుండి బైట పడడానికి అబద్దం చెప్తున్నాడా? అప్పుడు ఆ అబద్దం వల్ల తనకు జరిగే నష్టం గురించి వివరించి, మంచి విలువలను గూర్చి పిల్లవాడికి అర్థమయ్యేటట్లు వివరించాలి. వారు నిజం ఒప్పుకుంటే, అబద్దం చెప్పినందుకు దండించకుండా, నిజం ఒప్పుకున్నందుకు వారి ధైర్యాన్ని అభినందించండి.
పిల్లలు తమ తప్పులకు పశ్చాత్తాప పడేటట్లు చెయ్యలేగాని అర్ధంలేని శిక్షలతో వారిని శిక్షించకూడదు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: