అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే మొదట బహుమతి తల్లి పాలు.కొత్తగా అప్పుడే పుట్టిన పాపాయికి ఏ తల్లి అయినా తల్లిపాలకంటే మంచి ఆహారం ఇవ్వలేదు.పుట్టినప్పటి నుంచి కొన్ని నెలల వరకూ బిడ్డకు పాలు ఇవ్వడం మంచిది.అసలు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు చాలు లాభాలు ఉన్నాయి. అసలుతల్లిపాలల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం.. !!

మొదటగా పాపాయికి తల్లిపాలు తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతాయి. సరిపోయేంత గాఢత,సరైన పోషకాలుండి బేబీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి.తల్లిపాలల్లో ముఖ్య భాగం నీరు. మీరు మామూలు పాలకన్నా తల్లిపాలు కొంచెం పల్చగా ఉండటం చూసే ఉంటారు. దానికి కారణం తల్లిపాలల్లో 90% నీరు ఉంటుంది  కొత్తగా పుట్టిన బేబీ సున్నితమైన పొట్టకి సరిపోతుంది. తన జీర్ణవ్యవస్థ ఇంకా సంక్లిష్ట పదార్థాలను జీర్ణం చేసుకోలేదు. ఇది మీ బేబీని హైడ్రేటడ్ గా ఉండి, లోపలి అవయవాలను రక్షిస్తుంది. తల్లిపాలల్లో బేబీ ఎదగటానికి సాహయపడే సింపుల్ ప్రోటీన్లు సరైన మొత్తంలో ఉంటాయి.

ఇందులో కన్పించే ముఖ్య ప్రొటీన్ లాక్టోఫెర్రిన్, ఇది మీ బేబీని ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది ఎదగటానికి ముఖ్య ఖనిజలవణమైన ఐరన్ ను కూడా శరీరం పీల్చుకోడంలో సాయపడుతుంది.కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు ఒంట్లో శక్తికి ముఖ్య ఆధారాలు. పాలల్లో ఉండే సాధారణచక్కెర లాక్టోస్ తల్లిపాలల్లో ఎక్కువ ఉండి బేబీకి శక్తినిస్తుంది. తల్లిపాలల్లో ఇతర కార్బొహైడ్రేట్లయిన ఒలిగోసాకరైడ్స్ కూడా ఉంటాయి. ఇవి పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి డయేరియాను దూరంగా ఉంచుతాయి.మీ బేబీకి కొవ్వు పదార్థాలు రెండు కారణాలవలన కావాలి. కొవ్వుపదార్థాలు శక్తిని ఇస్తాయి అలాగే బరువు పెరిగేలా చేస్తాయి,ఇది బేబీ ఎదగటంలో చాలా ముఖ్యం.అలాగే మెదడు ఎదుగుదల, నాడీ వ్యవస్థ,చూపు సరిగ్గా రూపుదిద్దుకోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఇమ్యునోగ్లోబ్లిన్స్ తల్లిపాలల్లో ఇమ్యునోగ్లోబ్లిన్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఇన్ఫెక్షన్లని పెంచే సూక్ష్మజీవులతో పోరాడటానికి శరీరంలో ఉండే యాంటీబాడీస్. మీ బేబీ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా పెరిగి ఉండదు, అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకవచ్చు,ఇవి ఎదుగుదలలో ఆటంకాలు తెస్తాయి.అందుకని తల్లిపాలు తాగటం వలన మీ బేబీ తరచూ జబ్బు పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.ఇవే కాదు తల్లి పాలు బిడ్డ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మిగతావి తదుపరి వ్యాసంలో చూద్దాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: