కొంతమంది పిల్లలు అన్నం తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు.అది తినను, ఇది తినను అని భలే విసిగిస్తూ ఉంటారు.సరిగ్గా తినకపోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.దీనికి తోడు పిల్లలు చూడడానికి కూడా చాలా సన్నగా ఉంటారు. అయితే అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు పోష్టికాహారం ఇవ్వాలి. పిల్లలు ఎలాంటి ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారు.. ఏ ఆహారం తీసుకుంటే పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావు అన్న విషయం ముందుగా తెలుసుకోవాలి.. అయితే కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుండి బరువు తక్కువ ఉంటె మరికొంతమంది వయసు పెరిగే కొద్ది బరువు తగ్గుతూ ఉంటారు.



అలాంటి పిల్లలు బరువు పెరగడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.పిల్లలకు జావ ఇస్తున్నప్పుడు దానిపై పండ్ల ముక్కలు, ఎండుద్రాక్ష ఎక్కువ మోతాదులో వేసి పిల్లలకు ఇవ్వాలి. పీనట్ బటర్ లేదా వేయించిన వేరుశెనగపప్పు పిల్లలకు మంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా పాలు, అన్నంతో కలిపి తయారు చేసే ఫుడ్డింగ్‌లు కూడా మేలు చేస్తాయి. కోడిగుడ్డుతో చేసిన పదార్థాలు పొద్దున్న ఇస్తే పిల్లలకు మాంసకృత్తులతోపాటు, శక్తి కూడా లభిస్తుంది.ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలను పిల్లలకు తినిపించండి. ప్రోటీన్‌ ఆధికంగా ఉంటె పిల్లల బరువును సులభంగా పెరుగుతుంది.



పిల్లల బరువు పెరగటానికి పాలు ఎంతో సహాయం చేస్తుంది. పిల్లలు పాలు తాగటానికి ఇష్టపడకపోతే వారికి పాలతో చేసిన ఆహారాలను, పాలతో ఫ్రూట్ షేక్స్ చేసి ఇస్తే ఇష్టంగా తీసుకుంటారు. ఆరోగ్యంతో పాటు లావు కూడా అవుతారు. పిల్లలతో రోజుకి కొన్ని  కిస్మిస్‌ తినిపిస్తే వారు సులభంగా బరువు పెరుగుతారు. బయట దొరికే పిజ్జా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ అసలు పెట్టకండి. అవి తినడానికి రుచికరంగాా అవి తినడానికి రుచికరంగా ఉంటాయి తప్పప వాటిలో అవి తినడానికి రుచికరంగా ఉంటాయి తప్ప వాటిలో ఉంండే అవి తినడానికి రుచికరంగా ఉంటాయి తప్ప వాటిలో ఉంండే కొవ్వు అవి తినడానికి రుచికరంగా ఉంటాయి తప్ప వాటిలో ఉండే కొవ్వు పదార్థాలు శరీరానికి మంచిది కావు.


మరింత సమాచారం తెలుసుకోండి: