చిన్నపిల్లలకి తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. చాలా మంది పిల్లలకు సీజన్ మారినప్పుడు సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి.ఎప్పుడయితే పిల్లలలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు పిల్లలు ఎక్కువగా వ్యాధుల బారిన పడతారు.అయితే ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే  పిల్లలకు ఏ వ్యాధి వచ్చినా గాని ముందుగా యాంటీ బయోటిక్స్ వేస్తూ ఉంటాం.అయితే అవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది అవేంటో తెలుసుకుందాం.. !



ఏట్టి పరిస్థితులలోను మనకు నచ్చినట్లు యాంటీ బయోటిక్స్ మందులు వాడకూడదు.దగ్గు, జలుబు, నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్‌ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు వారం రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలావాటికి యాంటిబయోటిక్స్‌ వేయాల్సిన అవసరం లేదు.పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, అలాగే ఎక్కువగా ద్రవాహారం పెట్టడం చేయాలి. అలాగే కడుపు నిండుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీ బయోటిక్స్‌ వెయ్యకూడదు. అలాచేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.యాంటీబయోటిక్స్‌ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.అలాగే ఈ యాంటీబయోటిక్స్ కూడా ఒక కోర్స్ లాంటిది.. డాక్టర్ చెప్పిన కోర్స్ బట్టే పిల్లలకు మందులు వేయాలి. ఎక్కువ రోజులు అసలు వాడకూడదు.



చిన్నపిల్లలకు యాంటీబయోటిక్స్ పౌడర్ రూపంలో ఉంటాయి.ఈ పౌడర్ లో కాచి చల్లార్చిన నీటిని ఒక పరిమాణంలో పోసి పౌడర్ కరిగేవరకు ఉంచాలి.. పౌడర్ అంతా కరిగాక వైద్యుడు చెప్పిన పరిమాణంలో మందును బిడ్డకు వేయాలి. ఒకవేళ కోర్స్ అయిపోయాక ఇంకా మందు మిగిలితే దాన్ని పారేయడం ఎందుకు అని వాడడం లాంటివి చేయకూడదు.అలాగే దాన్ని భద్రపరిచి ఇంకోసారి వేయడం గాని చేయకండి అది చాలా ప్రమాదం. అలాగే ఈ మందులు చేదుగా ఉండడం వల్ల పిల్లలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంది. అందుకనే మందు వేసాక నోటిలో కొంచెం పంచదార గాని తేనె గాని ఇవ్వండి.. ఇంకో ముఖ్య విషయం ఈ మందు వాడే ముందు దానిమీద డేట్ చూసుకుని వాడండి.అలాగే ఈ మందు సీసాలు పిల్లలకు అందకుండా చూసుకోండి... !!సాధ్యమైనంత వరకు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడడం మంచిది కాదు.. !

మరింత సమాచారం తెలుసుకోండి: