చెవి ఇన్ఫెక్షన్ ఉన్నపుడు జలుబు చేస్తే చెవి మధ్య భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబ్ (eustachian tube) వాచిపోతుంది. పిల్లలకు చెవిలో మంటగా ఉంటుంది. పిల్లలకు ఈ వయసులో సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయించాలి. చెవి ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.. !!
చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, పిల్లలు ఏది తినడానికి ఇష్టపడరు. ఇన్ఫెక్షన్ వలన చెవిలో వాపు వస్తుంది. దాని వలన ఆహారం మింగడం చాలా కష్టంగా, నొప్పిగా ఉంటుంది. పిల్లలు ఆహారం సరిగా తినకపోతే చెవి ఇన్ఫెక్షన్ ఉందేమో చెక్ చేయండి. అలాగే మీ పిల్లల చెవిలో నుంచి తెలుపు లేదా పసుపు రంగులో ద్రవాలు కారుతుంటే తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించండి. పిల్లలలకు చెవిలో ఇన్ఫెక్షన్ చేసినప్పుడు చెవి లో కారే చీము వలన చెడు వాసన వస్తుంది. అందుకనే పిల్లల్ని తరచూ గమనిస్తూ ఉండండి. పిల్లలకు చెవిలో ఇన్ఫెక్షన్ చేసినప్పుడు చెవిలో చాలా నొప్పిగా ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్ చేసినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడం వలన, ఆహారాన్ని నమలకుండా మింగేస్తారు. దీని వలన వచ్చే అరుగుదల సమస్యతో విరోచనాలు, వాంతులు అవుతుంటాయి. అలా జరిగినప్పుడు చెవి ఇన్ఫెక్షన్ ఉందేమో చెక్ చేయండి. పై లక్షణాలు మీ పిల్లలలో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.