జామపండు పిల్లలలో నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. జామ పండులోని ఫోలిక్ ఆమ్లం పిల్లలలో మెదడు, వెన్నెముక సంబంధిత జనన లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది పిల్లలలో రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
జామ పండులో విటమిన్ 'సి'పుష్కలంగా ఉంటుంది. పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ 'సి'చాలా అవసరం.అందుకనే పిల్లలకు జామకాయ పెట్టడం చాలా మంచిది. ఒక జామకాయలో నారింజ పండు కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.అలాగే జామ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల పిల్లలలో కంటికి సంబందించిన అనారోగ్యాలు వస్తాయి.జామకాయ లో ఉండే విటమిన్ A ఆరోగ్యకరమైన కంటి చూపును నిర్వహించడానికి సహాయపడుతుంది.
జామ కాయలో అధిక ఫైబర్ కంటెంట్ పిల్లలలో జీర్ణక్రియను మెరుగు పరచడంలో సహాయపడుతుంది.పిల్లలలో మలబద్దకంను నివారిస్తుంది. జామ కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పిల్లలను క్యాన్సర్ ప్రమాదం నుండి నిరోధించడంలో సహాయపడతాయి.జామ కాయలో
కాల్షియం, ఇతర పోషకాలు నిండుగా ఉన్నాయి. ఇది పిల్లలలో ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
అందులోను జామ కాయ చాలా తక్కువ రేటుకే లభిస్తుంది. జామకాయ మనకు ఎక్కడయినా గాని విరివిగా దొరుకుతుంది.అందుకని పిల్లలకు కనీసం రోజుకి ఒక జామకాయ అయినా పెట్టండి.. !!