సాధారణంగా పిల్లలు తమకు ఎదురైన పరిస్థితులలో తమకు అర్థం కానీ భావోద్వేగాలకు శారీరక లేదా ప్రవర్తనాపరమైన పద్దతులలో స్పందిస్తారు.అంటే అల్లరి చేయడం మొదలుపెడతారు. అందువల్ల ఈ వయసు పిల్లలలో ఈరకమైన ప్రవర్తన కనిపిస్తుంది.పిల్లలకు పరిమితమైన పదాలు తెలియడం వల్ల వాళ్లకు ఎదురైన పరిస్థితులలో వాళ్ళ ఫీలింగ్స్ ను ఎలా వ్యక్తపరచాలో తెలియదు, అందుకని సులువుగా చేయగల పద్దతిని ఎంచుకుంటారు అంటే ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచించలేక అలాంటి గందరగోళ పరిస్థితిలో అరవడం, ఏడవడం మారం చేయడం ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.మీ పిల్లలు శృతిమించి అల్లరి చేస్తున్న సందర్భాన్ని మీ కంట్రోల్ లోకి తీసుకోవడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ, అయితే మీ పిల్లలు మారం మొదలుపెడుతున్నారు అని మీకు అనిపించగానే తనకు ఏమి కావాలో ప్రశాంతంగా చెప్పమని చెప్పండి.
ఒకవేళ మీ పిల్లలు ఏడుస్తూ అరుస్తూ గొడవ చేస్తుంటే వారు అవి అన్ని ఆపివేసి ప్రశాంతంగా అయ్యేవరకు వేచిఉండి అప్పుడు వారికి ఏంకావాలో అడగండి.మీరు ఒకసారి కాదు అని చెప్పిన తరువాత దానికి కట్టుబడి ఉండండి. సాధారణంగా పెద్ద వాళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే పిల్లల అల్లరి భరించలేక ఒకోసారి వారు అడిగింది చేసేస్తూ ఉంటారు.పెద్దల ఇలాంటి ప్రవర్తన వల్ల పిల్లలలో మారం చేసే అలవాటు వల్ల తాము అనుకుంది సాధించగలమని, అలా చేయడం వల్ల పెద్దవాళ్ళు తాము అడిగింది చేస్తారు అనే నమ్మకం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరే వాళ్లకు మారం చేయడం మంచిదే అని చెప్పినట్టు అవుతుంది.