ఆహార అలెర్జీ ఉన్న పిల్లవాడు తేలికపాటి ప్రతిచర్యను కలిగి ఉండవచ్చు లేదా అది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఒక అలెర్జీ ప్రతిచర్య వెంటనే రియాక్షన్ చూపిస్తుంది.ఒక్కోసారి తిన్న కొన్ని గంటల తర్వాత రియాక్షన్ చూపించవచ్చు.పిల్లవాడికి అలెర్జీ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి.ఈ రకమైన లక్షణాలు ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది పిల్లలు పెద్దయ్యాక పాలు, గుడ్ల వల్ల అలెర్జీకి గురి అవుతారు. కానీ వేరుశెనగ, కొన్ని రకాల చేపలు, రొయ్యలు వంటి ఆహారాలకు తీవ్రమైన అలెర్జీలు తరచుగా జీవితకాలం ఉంటాయి.ఆహార అలెర్జీలకు ఉత్తమమైన చికిత్స ఏమిటంటే ఎలర్జీ కలిగి ఉండే ఆహారానికి కొన్ని రోజుల పాటు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.
కొంతమంది పిల్లలు పాల వాసన అంటే అసలు పడదు. అటువంటి పిల్లల్ని పాలు తాగమని బలవంతం చేసి తాగించిన వాంతులు చేసుకుంటారు తప్ప పాలు తాగారు.. అలాగే కొంతమంది పిల్లలు కోడిగుడ్డులోని పచ్చ సొన తినరు.ఆ వాసన పీల్చిన వెంటనే వాళ్లకు కోడిగుడ్డు మీద ఇష్టం పోతుంది.. అలాగే కొన్ని కొన్ని ఆహార పదార్ధాలు తిన్న వెంటనే చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడడం లాంటివి వచ్చి దురదను కలిగిస్తాయి.అప్పుడు తల్లి దండ్రులు పిల్లలకు పెట్టె ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి..