పిల్లల పెంపకం అన్నది ఒక కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయస్సు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. తల్లి తండ్రులు ఇద్దరు కూడా పిల్లల మీద  వారి ప్రేమ ఆప్యాయతతో వాళ్ళ మనస్సులలో మార్పు తీసుకురావాలి.అంతేకాని అలా అని పిల్లలను ప్రతి చిన్న విషయానికి కఠినంగా శిక్షించకూడదు, తిట్టకూడదు.


 చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంది. తల్లి తండ్రులు పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఉంటే, అట్టి పిల్లలు  సమాజపరంగా ఎన్నో విజయాలను సాధిస్తారు.ఇంట్లో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణం అనేది పిల్లలకు కల్పించాలి.అంతేగాని ఎవరికి వారు ఎవరి గదుల్లో వాళ్ళు ఉండడం కాదు కుటుంభం అంటే. అలాగే  తల్లితండ్రులు కరుణ, దయ గల స్వభావులైతే, పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటారు. తల్లి తండ్రులలో ఈ గుణం ఉండటం చాలా అవసరం.అంతే కాని తల్లితండ్రులు కఠినత్వంగా ఉండకూడదు.కొంతమంది పిల్లలు యుక్తవయస్సు వచ్చాక  స్వేచ్చగా,స్వతంత్రంగా  ఉండాలని కోరుకుంటారు. తమ కార్యకలాపాలలో తల్లి తండ్రులు జోక్యం చేసుకోవడం చాల మంది పిల్లలు ఇష్టపడరు.



వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి పరస్పరం స్నేహ పూర్వకంగా ఉంటే తల్లితండ్రులకు పిల్లల పట్ల విశ్వాసం ఉంటుంది.అలాగే బిడ్డల
కోసమైన తల్లి తండ్రులు ఒకరి పట్ల మరొకరు సహనవంతులై ఉండాలి.తల్లితో భద్రతతో కూడిన అనుబంధం గల పిల్లలు అన్నివిధాలుగా బాగుంటారు. వారికి ఎటువంటి  సమస్య వచ్చినా తల్లి దగ్గరకు పరిగెడ్తారు, ప్రవర్తనా సమస్యలను కూడా అధిగమించగలుగుతారు.పిల్లలకు తల్లి తండ్రులే  గొప్ప స్నేహితులు అనే విషయాన్నీ గుర్తుపెట్టుకోండి. పిల్లలకు నచ్చిన విధంగా ప్రవర్తించండి.వాళ్ళ ఇష్టాలను గౌరవించండి. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకొని వాళ్ల ఇష్టానుసారంగా ప్రవర్తించండి. అంతేకానీ  పెద్దల ఇష్టాలను పిల్లలపై రుద్దకండి. వాళ్ల మనసు నొచ్చుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: