
వినికిడి శక్తి ని పెంపొందిస్తాయి.అలాగే పిల్లల కండరాల అభివృద్ధిని పెంపొందిస్తాయి.రంగుల పట్ల ఆసక్తిని కలగచేస్తాయి.కంటికి చేతికి మధ్య సమన్వయ పరిశీలన శక్తిని పెంపొందిస్తాయి.భాష, స్పర్శా జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తాయి. రంగుల ఫై అవగాహన, మేధా శక్తిని మెరుగు పరుస్తాయిఆసక్తిని, కుతూహలాన్ని పెంచుతాయి
సహజం గానే పిల్లలకు అందరు బొమ్మలు కొనిస్తుంటారు చాలా సందర్బాలలో బొమ్మ ఆకర్షణీయంగా ఉందనో, పెద్దగా ఉందనో, ఎక్కువ ఖరీదనో, తక్కువ ఖరీదనో బొమ్మను కొంటుంటారు. అలా మనం కొనే బొమ్మలు, ఆటవస్తువుల ద్వారానే పిల్లల అభివృద్ధి మెరుగుపరచవచ్చు.
ఒకవేళ బొమ్మలు కొనలేని స్థితిలో ఉంటే ఇంట్లో లభిoచే ఖాళీడబ్బాలలో చిన్న రాళ్ళు వేసి అందంగా రంగు కాగితాలతో చుట్టి రకరాకాల శబ్దాలు చేసే ఆట వస్తువులు గా కూడా తయారుచేసుకోవచ్చు .తల్లి తండ్రులు కూడా పిల్లల ఆటలో ఒక్కోసారి భాగస్వామ్యం అవ్వాలి.. మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడడం వల్ల వాళ్లు పొందే సంతోషం అంతా ఇంతా కాదు.. !!