కొంతమంది పిల్లలు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటారు. అయితే  పిల్లలలో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసు మీద ఆధారపడి ఉంటుంది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం,సాధారణంగా  బాలికల కన్నా బాలల్లో కోపం ఎక్కువగా ఉంటుందట. బాలురు 19 ఏళ్ల  మధ్య వయసు వచ్చినప్పుడు వారిలో ఎక్కువ కోపం వస్తుంది. అదే  20-26 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తక్కువ కోపం ఉంటుందట.  దీనిని బట్టి యవ్వన ప్రాయంలో కన్నా టీనేజీలోనే ఎక్కువ కోపం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అలాగే పిల్లలకు కోపం ఎక్కువ రావడానికి ఒక విధముగా తల్లితండ్రులు కూడా కారణం. పెద్ద పట్టణాలలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు.




ఏదో పని ఇవ్వడం అనే నెపం మీద వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన గేమ్స్ ఆడుతున్నారు.ఈ గేమ్స్ వల్ల పిల్లలు కూడా అలానే తయారవుతున్నారు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన పిల్లలంతా రోజులో కనీసం మూడునాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు . ఈ ఆటల్లో ప్రత్యర్థిని అంతమొందించినప్పుడే మీరు గెలుస్తారు అని కాన్సెప్ట్ ఉంటుంది.అలా మొబైల్ గేమ్స్ పిల్లల మనస్తత్వాన్ని మార్చుతాయి. అలాగే ఇంకొక విషయం తల్లిదండ్రులు తాము స్వయంగా కొట్లాడుకుంటూ పిల్లలను మాత్రం సరిగా ప్రవర్తించమంటే పిల్లలు ఎలా మాట వింటారు చెప్పండి.  అలాంటప్పుడు వాళ్లలోనూ హింసాత్మక ప్రవృత్తి బయలుదేరుతుంది. పిల్లలు తమకు నచ్చినట్లుగా ఉండాలనకుంటారు. అలా జరగనప్పుడు వాళ్లు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు.




పిల్లలకు కోపం రావడానికి గల మరొక కారణం ఏంటంటే హార్మోన్ మార్పులు.యవ్వన  సమయంలో వాళ్ల శరీరావయవాలు, మెదడు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి.అందుకే ఆ సమయంలో వాళ్లలో చాలా కోపం, హింసాత్మక ప్రవృత్తి కనిపిస్తాయి.పిల్లలు పాఠశాలలో తోటి పిల్లలతో గొడవపడుతుంటే లేదా వాళ్లను తిడుతుంటే, చదువుపై శ్రద్ధ పెట్టకుంటే.. తల్లితండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టాలి.అలాంటప్పుడు వాళ్ల కోసం సమయం కేటాయించాలి. వాళ్లతో పాటు బైటికి వెళ్లి వాళ్లతో రకరకాల ఆటలు ఆడించాలి. వాళ్లతో మాట్లాడాలి. వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులు వెదకడం మానేయాలి. ఎందుకంటే వాళ్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసు అదే కాబట్టి.. !!


మరింత సమాచారం తెలుసుకోండి: