ఈ రోజుల్లో చిన్నపిల్లలకు డైపర్లు వాడడం అనేది బాగా అలవాటు అయిపొయింది. గత కొన్నేళ్ళ నుండీ డైపర్స్ బాగా పాపులర్ అయిపోయాయి.ఈ బిజీ లైఫ్ లో పేరెంట్స్ కి కొంత ఊరట నిస్తాయి అనడంలో సందేహమే లేదు. అవి వాడడం తేలిక, ఈజీగా ఎవైలబుల్ గా ఉంటాయి, ఉతకనక్కర్లేదు, లీకేజ్ ఉండదు. డైపర్లు వేసుకుని పిల్లల్ని ఎక్కడికన్నా నిర్మొహమాటంగా తీసుకుని వెళ్ళవచ్చు. అయితే అవసరానికి మించి ఈ డైపర్లు వాడడం అనేది పిల్లలకు మంచిది కాదు.పసి పిల్లల స్కిన్ సాఫ్ట్ గా జెంటిల్ గా ఉంటుంది.అలాగే  కొన్ని డైపర్స్ సింథటిక్ ఫైబర్స్, రంగులు, హార్ష్ కెమికల్స్ కలిగి ఉంటాయి. ఇవి మీ బేబీ సెన్సిటివ్ స్కిన్ ని డామేజ్ చేసి ఎలర్జీని కలిగించవచ్చు.




అందుకే, సాఫ్ట్ గా, స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ తో ఉండే డైపర్ ని ఎంచుకోండి.డైపర్ రాషెస్ పిల్లలకి చాలా కామన్. తడి డైపర్ చాలా సేపు బేబీ ఒంటి మీదే ఉండిపోతే బ్యాక్టీరియా పెరిగి రాష్ కి దారి తీయవచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా మీ బేబీ డైపర్ మారుస్తూ ఉండండి.డైపర్స్ లో వాడే మెటీరియల్ బేబీ యూరిన్ ని పీల్చుకునేటట్లుగా ఉంటాయి. అదే మెటీరియల్ గాలి చొరకుండా చేస్తుంది. దాంతో బ్యాక్టీరియా పెరిగి ఇంఫెక్షన్స్ వచ్చే చాన్స్ ఉంది. బేబీ డైపర్ ని రెగ్యులర్ గా మారుస్తూ ఉంటే ఈ సమస్య రాదు.పిల్లలకు అదేపనిగా ఎప్పుడూ డైపర్ వేస్తూ ఉంటే  టాయిలెట్ ట్రైనింగ్ కొంచెం కష్టమౌతుంది.




ఎందుకంటే వాళ్ళకి అన్ని పనులు డైపర్ లోనే కానిచ్చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. దాంతో టాయిలెట్ ట్రైనింగ్ కి పిల్లలు చాలా పేచీ పెడతారు. డైపర్స్ వాడకం తో సంబంధం లేకుండా బేబీ కి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే ఈ సమస్య ఉండదు.బాగా తేమని పీల్చుకుని బేబీ స్కిన్ కి తడి లేకుండా ఉండే డైపర్స్ మంచివి. ఇవి లీకేజ్, రాషెస్, ఇంఫెక్షన్స్ లేకుండా చూస్తాయి. డైపర్స్ సాఫ్ట్ గా కెమికల్ ఫ్రీ మెటీరియల్ తో చేసినవి అయితే బేబీ స్కిన్ ని ఇరిటేట్ చేయకుండా ఉంటాయి.మీరు కొనే డైపర్ మీ బేబీ ఒంటికి సరిగ్గా పట్టేట్లు ఉండాలి. మరీ లూజ్ గా ఉంటే లీకేజ్ ఉంటుంది, మరీ టైట్ గా ఉంటే రాషెస్ వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: