పిల్లలకు నెలలు నిండేకొద్దీ ఎలాంటి ఆహారం పెట్టవచ్చో, ఎలాంటి ఆహారం పెట్టకూడదో అన్న అనుమానంలో ప్రతి తల్లితండ్రులు అయోమయంలో పడతారు.అందుకే ఈరోజు కధనంలో ఎంత వయసులో ఏవేవి పిల్లలకు పెట్టాలో తెలుసుకుందాం.. !! సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అయిన  దాల్చిన చెక్కను బిడ్డకు  6 నెలల దాటిన తరువాత నుంచి మొదలు పెట్టాలి. అలాగే ఆపిల్, పియర్ ప్యూరీస్, ఫ్రూట్స్ , ఓట్స్,  మసాలా కిచిడిలో  దాల్చిన చెక్కను జోడించవచ్చు. పిల్లల కోసం ఆపిల్,  పియర్ వంటకాలతో జత చేయడానికి దాల్చిన చెక్క మంచి మసాలా. ఇది ఎంత యాడ్ చేయాలంటే..  బేబీ ఫుడ్లో చిటికెడు దాల్చినచెక్కను కలపడం మంచిది. దీనిని కలపడం వల్ల బిడ్డ జీర్ణక్రియ ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్ కూడా.అలాగే కొత్తిమీరను 7 నెలల తర్వాత శిశువులకు ఇవ్వవచ్చు.




కొత్తిమీర ఆకులను సూప్, కిచిడిలో వేయవచ్చు. ఆకులను బాగా రుబ్బి ఆహారంలో చేర్చండి. ఎంత యాడ్ చేయొచ్చంటే.. శిశువు ఆహారంలో కొన్ని ఆకులు చేర్చవచ్చు. బేబీ ఫుడ్‌లో చేర్చే ముందు వాటిని మెత్తగా కత్తిరించండి. అలాగే కొత్తిమీరను ముందుగా నీటిలో శుబ్రపరిచండి. అలాగే ఈ కొత్తిమీర పెట్టడం వాళ్ళ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ఇది క్రిమినాశక, యాంటీఆక్సిడెంట్.అలాగే  ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.6 నెలల తరువాత శిశువులకు గ్రీన్ ఏలకులు ఇవ్వొచ్చు. గ్రీన్ ఏలకుల పౌడర్‌ను ఖీర్, షీరా, పాన్‌ కేక్‌ లలో ఉపయోగించొచ్చు. శిశువు ఆహారంలో ఏలకులు ఎంత వేయాలి అంటే   బేబీ ఫుడ్‌ లో 1/4 - 1/2 టీ స్పూన్ ఏలకుల పొడిని కలపొచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, శ్వాసకోశ అనారోగ్యాలను తొలగించడానికి సహాయపడుతుంది.  ఇందులో రాగి, ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తహీనతకు నిరోధించడానికి ఉపయోగపడతాయి.



7 నెలల తర్వాత శిశువు ఆహారంలో వాము జోడించవచ్చు. వాము పొడిని హెల్త్ మిక్స్, స్నాక్స్‌లో చేర్చొచ్చు. అలాగే పిల్లలకి వాము వాటర్ కూడా తాగించడం కూడా మంచిది. ఎంత పరిమాణంలో అంటే బేబీ ఫుడ్‌లో 1/4 నుంచి 1/2 టీస్పూన్ జోడించవచ్చు. వాము  విరేచనాలు, దగ్గు, జలుబుకు సమర్థవంతమైన నివారణ. ఇది సులభంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది పిల్లలలో పేగు పురుగులను నివారించడానికి సాయపడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: