పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీ మీటర్లుంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు యవ్వనంలోకి చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.
కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది.
పుష్టికరమైన ఆహారంతో బాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని వైద్యులు తెలిపారు.
అయితే మార్కెట్లో దొరికే టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశ పెట్టుకోకూడదు.
ఇవి బలహీనంగా నున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుండి అన్ని పోషకాలు కలిగిన ఆహారం పెట్టాలి..అలాగే చాలా మంది తల్లి తండ్రులు పిల్లలను బయట ఆడుకోవడానికి ఒప్పుకోరు. కానీ పిల్లల్ని బయట ఆడుకోనిస్తేనే మంచిది. వాళ్ళ కండరాలు, ఎముకలు దృడంగా పెరుగుతాయి.. అలాగే ఇలా ఆదుకోవడం వల్ల వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరుగుతారు. అలాగే పిల్లలకు ప్రోటీన్స్ కలిగిన ఆహారంను పెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లల ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి.. ఎంతకీ ఎత్తు పెరగకపోతే వైద్యుడిని సంప్రదించాలి.