అంతేకాకుండా తమ తల్లిదండ్రుల అభీష్టానికి అనుగుణంగా వ్యక్తిగత విజయాలు సాధించాలనుకునేవారు అనేక రకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆందోళన, ఉద్వేగం, క్రుంగుబాటు వంటి సమస్యలతో పిల్లలు సతమతమవుతున్నారు. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమిటంటే చదువులో కూడా ఇలాంటి పిల్లలు వెనకబడతారు. పిల్లలకు నచ్చినది చేయనిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలో పయనిస్తోంది .. అలాగే పిల్లలకు కొంచెం సంస్కారం గురించి కూడా నేర్పించాలో. సంస్కారానికి అధిక ప్రాధాన్యతని ఇచ్చిన కుటుంబాలలోని పిల్లలు... ఇటు చదువులోనూ, అటు ప్రవర్తనలోనూ అందరికంటే ఓ అడుగు ముందున్నారు
ర్యాంకులు, బహుమతులు వంటి బాహ్యమైన విషయాలతో తనని తాను కొలిచి చూసుకునే పిల్లవాడికి తన మీద తనకు నమ్మకం కలగదు. వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే తనకు విలువ అన్న అభిప్రాయం అతని మనసు మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా అటు చదువులోనూ రాణించలేకపోతాడు, ఇటు తనదైన వ్యక్తిత్వాన్నీ రూపొందించుకోలేకపోతాడు. అన్నింటికీ మించి జీవితాన్ని ఆస్వాదించలేకపోతాడు.అలాగని పిల్లల్ని గాలికి వదిలేయని కాదు.చక్కగా చదువుకోమని ప్రోత్సహిస్తూనే, ఇటు వారిలో మంచి విలువలని కూడా పెంపొందించే ప్రయత్నం చేయాలి. ఇటు వ్యక్తిగత విజయాలకీ, అటు వ్యక్తిత్వానికీ సరసమానంగా ప్రాధాన్యత ఇచ్చేలా పిల్లల్ని పెంచాలి.. !!