నేటి సమాజంలో పిల్లలు జింక్ ఫుడ్ కి చాల అలవాటు పడ్డారు. అయితే వాటిని ఎక్కువగా తినడం వలన పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అయితే పిల్లలు జింక్ ఫుడ్ తినకుండా ఉండాలి అంటే కింది వాటిని పాటించడం మంచిది. మీ పిల్లలను వంటి గదికి దూరంగా ఉంచకండి. వారిని కూడా భోజన తయారీలో సహాయం చేయమని అడగండి. లేదా టేబుల్ సెట్ చేయడం, పదార్థాలను అప్పగించడం వంటి చిన్న చిన్న పనులను చేయమని అడగండి. దీంతో వారు మొత్తం ప్రక్రియలో పాల్గొన్నట్లు భావిస్తారు. దీంతో వారే స్వయంగా సిద్ధం చేసిన ఆహారంగా వాటిని పరిగణించి మీతో కలిసి తింటారు.
 
ఇక చాలా మంది పిల్లలు ఇంట్లో వండిన ఆహారం కంటే బయట చిరుతిళ్లు తినడానికే ఇష్టపడుతుంటారు. దీన్ని మీరు ప్రోత్సహిస్తే మీ పిల్లలు అనారోగ్య భారీన పడే ప్రమాదం ఉంది. ఒకవేళ వారికి స్కాక్స్ తినిపించాలి అనుకుంటే అనారోగ్యకరమైన స్నాక్స్ బదులు మీరే రుచికరమైన, ఆరోగ్యకరమైన స్కాక్స్ ను తయారు చేసి వారికి ఇవ్వండి. అంతేకాక, పిల్లలు క్రమం తప్పకుండా భోజనం చేసేలా చూడండి.

అయితే మీ పిల్లలకు ఇష్టమైన వంటకంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చండి. దీంతో తమకు ఇష్టమైన వంటకంలా భావించి దాన్ని ఆరగిస్తారు. ఉదాహరణకు, బర్గర్ ప్యాటీలో సోయాతో పాటు బంగాళాదుంపలను చేర్చడం, పాలలో డ్రైఫ్రూట్స్, విత్తనాలను చేర్చడం వంటివి చేయండి. ఇవి మీ పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. మీ పిల్లల మెరుగైన ఆరోగ్యానికి సహకరించే పదార్థాలను ప్రతిరోజు భోజనానికి ముందు ఇవ్వండి. అంతేకాక, మీ పిల్లల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించకండి. వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి చెడు ఆహారపు అలవాట్లను మాన్పించేలా ప్రయత్నించండి.

అంతేకాక ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను మీ పిల్లలకు తెలియజేయడం చాలా ముఖ్యం. వారు పుస్తకాలలో కన్నా మీ నుండే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని గమనించండి. సరిగ్గా కూర్కోవడం, రాత్రి పూట పడుకునే ముందు బ్రష్ చేయడం, సరైన నిద్ర వంటివి వారికి అలవాటు చేయండి. మీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికంటూ ప్రత్యేక రుచులు, అభిప్రాయాలను ఏర్పర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో వారు మొదటగా ఇష్టపడని వంటకాలను కూడా, తర్వాత ఇష్టపడవచ్చు.- కాబట్టి, కొత్త వంటకాలను వారికి పరిచయం చేసే ముందు సహనంతో వ్యవహరించండి. తద్వారా వారికి ఇష్టమైన ఆహారాలతో పాటు కొత్త ఆహారాలను కూడా అందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: