ముందుగా పిల్లలకు ఎలా మాట్లాడాలో నేర్పించాలి. పెద్దలు ఆచరించడం వల్ల పిల్లలు కూడా వారిని చూసి మాట్లాడుతారు.
థాంక్స్, సారీ లాంటి చిన్న చిన్న పదాలను చిన్నతనం నుండే అలవాటు చేయాలి.ఏమైనా తప్పులు చేసినప్పుడు సారీ చెప్పాలి అని పిల్లలకు నేర్పించాలి. అదేవిధంగా ఏదైనా ఇచ్చినప్పుడు థాంక్స్ అని చెప్ప మనాలి.
పిల్లల ఎదుట ఇప్పుడు అసభ్య పదజాలం వాడకూడదు. అదేవిధంగా గొడవలు పడకుండా ఉండాలి.ఇది వారి పసి మెదడు మీద తీవ్రంగా పనిచేస్తుంది.
పెద్దవాళ్ళు పిల్లలను దండిస్తే క్రమశిక్షణగా ఉంటారన్నది నూటికి నూరుపాళ్లూ అబద్ధం.పిల్లలకు అర్థమయ్యేలా పది సార్లైనా, వందసార్లైనా ఓపిగ్గా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది.
మంచి ప్రవర్తన గురించి పిల్లలకు పాఠం లాగా రోజు కొద్దిసేపైనా చెబుతూ ఉండాలి. అలా చెబుతుండడం వల్ల పిల్లల మెదడు లో బలంగా నాటుకుంటుంది.
పిల్లల్లో మాటల కన్నా దృశ్యం వారిలో బలంగా నాటుకుంటుంది.కాబట్టి పుస్తకాలు, యానిమేటెడ్ వీడియోల ద్వారా పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి.
పిల్లలను క్రమశిక్షణ పేరుతో ఇతర పిల్లలతో ఇప్పుడు పోల్చకూడదు. అలా చేయడంవల్ల పిల్లల్లో ఆత్మన్యూనతా భావం చోటు చేసుకుంటుంది.