చిన్న పిల్లలు చాల త్వరగా జబ్బున పడుతుంటారు. సాధారణంగా చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు. దాంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా.

అయితే చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది. నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది.

ఇక విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి. టమాట, బంగాళదుంప, నారింజ, నిమ్మ, కమలా, కివి వంటి వాటిలో విటమిన్‌ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి ఏర్పడటానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడిగుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్‌ తోపాటు సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

అంతేకాదు పిల్లలకు రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: