ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు వేయించిన వేరుశనగ పప్పు, నట్స్, ఖాక్రా వంటివి లేట్ నైట్ తినడానికి వీలుగా ఉంచండి. బిస్కెట్లు, కుకీలు, కేక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే నమ్కీన్స్ వంటివి ఎవాయిడ్ చేయండి. అలాగే మైదా, పంచదార, ప్రిజర్వేటివ్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్న ఫుడ్స్ కూడా ఎవాయిడ్ చేయండి. ఇక ఎగ్జామ్స్ అయ్యే వరకూ బయటి ఫుడ్ తినకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ ఫుడ్ వలన కొన్నిసార్లు ఏమైనా ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త రకాల ఆహార పదార్థాలను అందించకూడదు. ఒకవేళ అవి వారికి పడకపోతే ఎలర్జీ వచ్చే రిస్క్ ఉంటుంది. పరీక్షల సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. .
అయితే మీల్స్ మధ్యలో నట్స్, సీడ్స్, పండ్లు, సలాడ్స్, సూప్, యోగర్ట్, స్మూతీలు, మజ్జిగ, ఎగ్స్, ఇడ్లీ, ఢోక్లా, పాలు వంటివి ఇవ్వవచ్చు. బ్రేక్ ఫాస్ట్ చాలా సేపు పొట్ట ఖాళీగా ఉన్న తరువాత తింటారు కాబట్టి దాన్ని కచ్చితంగా చేయండి. ఇందువల్ల వారి మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్‌కిన్ సీడ్స్ వంటివి అలాగే తినేయవచ్చు, లేదా పొడి కొట్టి సలాడ్స్, శాండ్విచెస్. సూప్స్, స్మూతీల్లో కలిపి ఇవ్వవచ్చు.
ఎగ్జామ్ సమయంలో ఎక్కువగా ఒకేచోట కూర్చోని చదువుతూ ఉంటారు. అలాకాకుండా మీ పిల్లలు కూడా కొన్ని నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలి. ప్రతి గంటకీ ఒక సారి లేచి స్ట్రెచ్ చేయడం, కాసేపు వాకింగ్ చేయటం వంటి వాటి వల్ల యాక్టివ్గా ఉంటారు. ఐదు పది నిమిషాలు మెడ, కళ్ళ ఎక్సర్సైజులు చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.పిల్లలకి పోషకాహారం తినిపించాలి. సరైన సమయానికి పడుకునేలా చూడండి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధవహించి.. అవసరైన ప్రోటిన్ ఫుడ్ అందించడం ఉత్తమం.