ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చి ఎక్కడికైనా పోయి చావండిరా ! అని కసిరి గొట్టాడు. పరమనందయ్య. శిష్యులు చేసేదిలేక చివరకు పోయారు. చెరువులో నీరు త్రాగి దాహం తీర్చుకుని తమ కర్తవ్యం గురించి ఆలోచించసాగారు. ఇంతలో ఒక తుంటరి ఏంటి పంతుళ్లూ! ఇక్కడున్నారు ? రామయ్య దయ్యమై ఊరిపొలిమేరల్లో తిరుగుతున్నాడట. ఇక్కడకు రాకండి పారిపోండి అని భయపెట్టాడు. ఆ మాటలు విన్న వెంటనే శిష్యులు మొహాల మీద నెత్తురుచుక్కలేదు. నిశ్చేష్టులయ్యారు. భయంతో అటునిటూ పరుగెత్తి మరల అక్కడికే వచ్చి ఒరేయ్ మనమెందుకు పరుగెతున్నామురా ? అని ఆలోచించుకొని కొంతసేపటికి మరల బెంబలు పడుతూ జ్ఞాపకమొచ్చింది రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యం అనుకొని తలోదారి పారిపోయారు. అలావారు పోయిపోయి పరమానందపురాన్ని చేరుకొన్నారు. అక్కడ మధూకరవృత్తిని చేబట్టి దిక్కులేని పక్షుల్లా జీవించసాగారు. గురువుగారికింతలో మరలా శిష్యలపై ధ్యాసమళ్ళింది. వెర్రికుంకలు ఎక్కడున్నారో! అని బెంగపెట్టుకొని వెదకనారంభించించారు. కొంత కాలానికి శిష్యల జాడ తెలిసింది. రమ్మన మని కబురు పెట్టారు. కానివారు రామయ్య దయ్యమై తిరుగుతున్నాడు. మమ్మల్ని చంపేస్తాడు, మేము రాము అని బదులు పంపారు. గురువుగారు శిష్యలను సమాధానపరిచి వెనక్కి పిలిపించారు. గురువుగారు పంపిన వ్యక్తితో శిష్యలందరు తిరిగి వచ్చి బుద్దిగానే ఉంటామండీ! మమ్మల్ని కసరుకోకండి! మేమంతా మా శిష్యులమేగా అంటూ గురువుగారి వద్దనే ఉండిపోసాగారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: