అయితే నిద్రపోతున్నప్పుడు పళ్ళు కొరకడాన్నీ బ్రక్సిజం అని అంటారు. ఇదొక వైద్య పదం మాత్రమే కానీ జబ్బు కాదు. ఈ సమస్య ఎక్కువ నిద్రపోయేటప్పుడు కనబడుతుంది. కొంతమంది నిద్రపోకుండా ఉన్నప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇది వ్యాధి కాదు. కొన్నిఇతర సమస్యల కారణంగా నిద్రలో పళ్లు కోరుకుతుంటారు. ముఖ్యం గా ఒత్తిడి, ఆందోళన కు ఎక్కువ గురైనప్పుడు వాళ్లు నిద్రలో ఆ విషయాలు గుర్తు వచ్చి పళ్లు కోరుకుతుంటారు.
ఇక అనారోగ్య సమస్యలతో కొన్ని రకాల మందులు వాడే వారిలో కూడా ఈ లక్షణం ఉంటుంది. చాలామంది నిద్రపోయేటప్పుడు గురక వస్తుంటుంది. ఇది వరకు వయసులో పెద్దవాళ్లు మాత్రమే గురక పెట్టేవారు.కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా గురక వస్తుంది. జలుబు, దగ్గుఉన్నప్పుడు ముక్కుతో ఊపిరాడక..నోరు తెరిచి పాడుకుంటుంటారు. దీని వల్ల కూడా గురక వచ్చే అవకాశం ఉంది. అలా గురక వచ్చేటప్పుడు కూడా పళ్ళు కొరకడానికి అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతేకాదు.. స్లీప్ పెరాలసిస్ సమస్యతో ఉన్నవారు కూడా ఇలా దంతాలు కొరుకుతుంటారు. ఇది నిద్రపోతున్నప్పుడు లేదా మెలకువగా ఉన్నప్పుడు తాత్కాలిక కదలిక కు దారితీస్తుంది. పొగ తాగడం, డ్రింక్ చేయడం కూడా నిద్రలో పళ్లు కొరకడానికి ఒక కారణం అవుతుంది. టీ, కాఫీ వంటి కెఫిన్ డ్రింక్స్ కూడా బ్రక్సిజం వచ్చేందుకు దారితీస్తాయి. పళ్లు కొరికే సమస్య అనేది నిద్రలో వచ్చేది కాబట్టి, ఇది బటయ పడేంత వరకు ఇది ఉన్నట్టు తెలియదు .