చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్లు, క్యాండీలంటే ఇష్టం. ఇంకొందరు బబుల్ గమ్స్ కూడా తింటుంటారు. కానీ దీనివల్ల వారు అనుకోకుండా వాటిని మింగేస్తే వారి గొంతులో అవి ఇరుక్కుపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు లాలీపాప్స్ తినడం ద్వారా ఎక్కువ సమయం పాటు చక్కెర పళ్లకు దగ్గరగా ఉంటూ పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా వారికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక పిల్లలకు చిన్నతనంలో అస్సలు కారం లేకుండా ఆహారం పెడుతుంటాం. తర్వాత కొద్దికొద్దిగా కారం పెంచుతూ మామూలు ఆహారం అలవాటు చేస్తాం. అయితే పిల్లలకు ఎక్కువ కారం, ఎక్కువ నూనె ఉన్న పదార్థాలను పెట్టకపోవడం మంచిది. కారం ఎక్కువ ఉన్న ఆహారం పెట్టడం వల్ల అది వారి పేగుల గోడలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే నూనె ఎక్కువగా ఉన్న వస్తువులు తినడం వల్ల వారికి అరుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వంటివి ఎదురవుతాయి.
అలాగే జామ, యాపిల్ లాంటి పండ్లు కూడా. ద్రాక్ష పండ్లను కూడా వారికి అలాగే ఇవ్వకూడదు. వీటిని ఒకవేళ వారికి ఇవ్వాలనుకుంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందించాలి. వారు నమలకుండా మింగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. పెద్దగా ఉన్న ముక్కలు పెట్టకుండా చూసుకోవాలి.
పిల్లలకు నట్స్, సీడ్స్ వారి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే వీలైనంత వరకూ వీటిని వారికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారికి అప్పుడప్పుడే పళ్లు వస్తుంటాయి. వీటిని నమలడం వారికి ఇబ్బందవుతుంది. దీంతో అలాగే మింగేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల అవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.