చిన్న పిల్లలకు ఏకాగ్రత్త చాల అవసరం. పెద్దలు అయితే తమకు అవగాహన ఉంటుంది కాబట్టి తమ దృష్టిని మరల్చుకునే చాతుర్యం ఉంటుంది. కానీ చిన్నారుల విషయంలో ఇది సాధ్యం కాదు. పరధ్యానంగా ఉంటే నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్‌ని డిఫ్యూజర్ లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వాసన పీల్చితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి చిన్నారులకు ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఆయిల్ ఫ్రైలను తినిపించడం తగ్గించాలి. ముఖ్యంగా కూల్‌డ్రింకులు, వేపుళ్లను తినిపించకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలోని జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక ఇవి వారి మూడ్‌పైనా ప్రభావం చూపిస్తాయి.

 కంటి నిండా సరైన నిద్ర అవసరం. పెద్దలకు 7-9 గంటల నిద్ర సరిపోయినా పిల్లలకు మాత్రం 10-12 గంటల నిద్ర అవసరం అని ఆయుర్వేద నిపుణులు సూచించారు. చిన్నారులకు సాయంత్రం పూట ప్రతిరోజూ బాడీ మసాజ్ చేయాలి. అనంతరం పసుపు పెట్టి వెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఇలా చేస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కండరాలు కూడా గట్టిపడతాయి.

అయితే ముక్కు రంధ్రాల ద్వారా నస్యా (ఆయుర్వేద మందు) లేదా కొన్ని చుక్కల నూనెను వేయాలి. ఇలా చేస్తే తలనొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. అయితే నస్యా ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇన్‌ఫ్యూజ్ చేయాల్సిన పదార్థం నాణ్యతగా ఉండటంతో పాటు దాని పరిమాణం నిర్దిష్టంగా ఉండాలి.

అంతేకాదు.. పడుకునేముందు పాదాల మర్దన చేస్తే శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో సాధారణ అసమతుల్యతలను మెరుగుపరుచుకోవడానికి ఈ విధానం సహాయపడుతుంది. చిన్నారులకు మంచి నిద్ర కోసం గోరువెచ్చని పసుపుపాలు లేదా యాలకులు వేసిన పాలు లేదా కుంకుమపువ్వు వేసిన పాలు ఇవ్వండి. ఇలా పాలు ఇవ్వడం వల్ల పిల్లల ఏకాగ్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.

ఇక అమ్మానాన్నల మధ్య అనుబంధం పిల్లలపై ప్రభావం చూపుతుంది. భార్యాభర్తలిద్దరూ తరచూ కీచులాడుకుంటే అది చిన్నారుల హృదయాలను గాయపరుస్తుంది. తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలు పెరిగే చోట భయం, ద్వేషం కలుగుతాయి. అందుకే గొడవలకు స్వస్తి పలకాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: