చిన్నప్పటి వయసులో పిల్లలకు ఆట బొమ్మలతో ఆడుకోవడం మహా సరదా.. అయితే వారు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా వారితోపాటు ఆడాలి. అప్పుడే చిన్నపిల్లలకు మీ మీద ప్రేమ పెరుగుతుంది. 1-2 ఏళ్ల వయసులో చిన్న పిల్లలు మాటలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. సాంగ్స్ లాంటివి ప్లే చేసినప్పుడు శరీరాన్ని కదిలించడం, లేదా పాటలు పాడుతున్నట్లు అరుస్తూ కనిపిస్తారు. ఆ వయసులో ఏ పని చెప్పిన చేస్తుంటారు.
చిన్నప్పటి నుంచే తన భోజనం తాను తినేలా, నీరు తాగేలా అలవాటు చేయాలి. ఇంట్లో వేరే పిల్లలతో ఆడుకోవడం నేర్పించాలి. బయటికి వెళ్లినప్పుడు ప్రతి విషయం గురించి తెలిసేలా అవగాహన కల్పించాలి. మనుషులతో ఎలా నడుచుకోవాలి. ఎలా మాట్లాడాలో తల్లిదండ్రులే నేర్పించాలి. 2-3 ఏళ్ల పిల్లలకు బట్టలు వేసుకోవడం, తీయడంలో సహకరిస్తూ నేర్పించాలి. కంచం, గ్లాసు కడుక్కొని భోజనం చేసేలా, కాళ్లు, చేతులు కడుక్కునేలా నేర్పించాలి. అలా చేసినప్పుడే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది. ఈ లక్షణాలు వీరి భవిష్యత్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి.