ఇక పిల్లలు ఇలా ఏదైనా చేసినపుడు అల్లా వారికీ ఏదైనా చిన్న శిక్ష లాంటిది ఇవ్వండి. బొమ్మలతో కాసేపు ఆడుకోకూడదు లేదా వేరే ఏదైనా సరే కానీ మరి కఠినంగా ప్రవర్తించవద్దు. ఇలా చేయడం మూలంగా వారికీ అర్ధం అవుతుంది వారు చేస్తున్నది తప్పు ఆలా చేయకూడదు అని. ఒకసారి వారికీ అర్ధం అయితే ఇంక వాళ్లే మానేస్తారు.
అయితే చాలా మంది తల్లిదండ్రులు ఉపయోగించే చిట్కాలతో ఒకటి. పిల్లలకి దేనిమీద అయినా సరే దృష్టి తక్కువగా ఉంటుంది అందువలన వారిని ద్రుస్తి మళ్లించడం చాలా సులభం. ఇటువంటి సమయంలో ఏదైనా వారితో ఆదుకోండి లేదా ఎదో ఒకటి చేసి ఆ చోటు నుండి వారిని తీసుకెళ్ళిపోతే వారు కాస్త శాంతిస్తారు.
అంతేకాక పిల్లలు ఇలా బెట్టు చేస్తూ ఉన్నపుడు సహజంగా మనం కఠినంగా మాటాడటం లేదా వారిని తిట్టేస్తూ ఉంటాము. ఆలా చేయడం వల్ల వారు ఇంక బెట్టు చేస్తారు గాని అది తగ్గదు అందువలన వారితో ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా చెప్తే పిల్లలు బాగా అర్ధం చేసుకుంటారు. పిల్లలు బెట్టు చేస్తుంటే వారిని ఆలా ఎత్తుకుని లేదా ఎదో ఒకటి చేసి వారిని ఆ ప్రదేశం నుండి తీసుకెళ్లిపొండి. ఆలా చేసినప్పుడు తల్లి దండ్రులు వారిని కౌగిలించుకున్నపుడు ఎంత భద్రత భావం కలిగి ఉంటారో ఇలా చేసినపుడు కూడా అంతే ప్రభావం వుంటుంది.