ఉరుకుల, పరుగుల జీవితంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇక పిల్లలను ప్లే స్కూల్స్ వదిలేసి వెళ్లి.. సాయంత్రం మరల ఇంటికి తీసుకొస్తారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అయితే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసేటప్పుడు కేవలం పనికే పరిమితం కాకుండా పిల్లలతోనూ సమయాన్ని గడపడం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు ఇంట్లో పనితో పాటు ఆట కోసం కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. అలా చేయడం మీరు పని వాతావరణం నుంచి బయటపడవచ్చునని తెలియజేస్తున్నారు. పిల్లల కోసం కేటాయించిన ఆట ప్రదేశంలో మీ పిల్లలతో కలిసి సరదాగా గడపవచ్చునని అంటున్నారు. సాధారణంగా చాలా మంది వర్క్ ఫ్రం హోం కారణంగా పని గంటలు పెరిగాయని చెబుతున్నారు. మరికొంత మంది పని లేకపోయినా అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటూ ఉంటారు.

ఇక తల్లిదండ్రులు పని గంటలు సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని, పని లేనప్పుడు కంప్యూటర్ ముందు గడపడం మానాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం కారణంగా ఆఫీసుకు వెళ్లడం, తిరిగిరావడానికి చేసే జర్నీ సమయం తగ్గింది కాబట్టి.. ఆ సమయాన్ని పిల్లలతో గడపాలని నిపుణులు వెల్లడించారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా సంస్థలు బంద్ అవ్వడంతో దాదాపు విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమైయ్యారు. ఇక తల్లిదండ్రులు కూడా వర్క్ ఫ్రం చేస్తుండడంతో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం వచ్చిందని అన్నారు. ఇలాంటి సమయంలో పిల్లలకు వంట నేర్పడం, ఇంటిని శుభ్రం చేయడం లాంటి పనులను అలవాటు చేయడం నేర్పించాలని నిపుణులు తెలిపారు. ఇక ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న కొత్త కొత్త కోర్సులను వెతికి పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయాలని  తెలిపారు.

అంతేకాదు.. పిల్లలకు స్కూల్/కాలేజీ ఉన్నప్పుడు పిల్లలతో కలిసి భోజనం చేయడం అనేది కుదరదు. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రం హోం సమయంలో మీరు, మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వారితో కలిసి భోజనం చేయడం. పిల్లలను సంతోష పెట్టడానికి వారికి తినిపించడం, కలిసి భోజనం చేయడం దోహదపడుతుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: