చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. నవజాత శిశువు విషయంలో చాలా ఆందోళన చెందుతుంటారు. ఎలాంటి ఫుడ్స్ ఆ వయసు పిల్లలకు తినిపించాలి. వారి ఆరోగ్యానికి సరిపడా పౌష్టికాహారం అందుతుందా..? అనే విషయంపై ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. అయితే నవజాత శిశువు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలనే విషయంపై కింద తెలిపిన సమాచారం ప్రకారం తల్లులు తెలుసుకోవచ్చు.

రెండు నెలల పిల్లాడికి..
అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి నెల వయసు పిల్లాడి వరకు రోజుకు 8 నుంచి 12 సార్లు చనుపాలు తాగించాలి. ప్రతి గంటలకు ఒకసారి ఫీడ్ చేయించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు మినిమం 15 సార్లు అయినా చనుపాలు తాగించాలి. తల్లలు ఒక టైమ్ మెయిన్‌టెన్ చేస్తూ.. ఆయా సమయాల్లో పిల్లాడికి పాలు తాగించాలి. ఒక వేళ పిల్లాడు నిద్రపోతూ ఉన్నా.. నెమ్మదిగా నిద్రలేపి పాలు తాగించాలి. వయసు పెరిగే కొద్ది పిల్లల ఆకలి కూడా పెరుగుతుంది. అలా వారు పాలు ఎక్కువగా తాగుతుంటారు.

నాలుగు నెలలప్పుడు..
నాలుగు నెలల పిల్లాడికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. పాలు సరిపోదు. ఫీడ్‌కి నాలుగు ఔన్స్‌ ల పాలు ఉండేలా చూసుకోవాలి. పాలు సరిపోనప్పుడు డాక్టర్ల సలహా మేరకు సజెస్ట్ చేసిన ఆహారాన్ని తినిపించాలి. పిల్లల పెరుగుదల, పోషణకు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అవసరం. కాంప్లిమెంటరీ ఫీడింగ్ మొదలుపెట్టినప్పుడు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.

ఆరు నెలల పిల్లాడికి..
ఆరు నెలల పిల్లాడికి 8 జౌన్స్ ల చనుపాలు పట్టాలి. ఫీడింగ్ సమయంలో గ్యాప్ చూసుకుని పాలు పట్టండి. శిశువు ఆకలి వయసును బట్టి మారుతుంటుంది. ఒక్కో రోజు పిల్లలు అధికంగా ఆహారం తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఎంత తినాలని అనుకుంటే అంత పరిమాణంలో తిననివ్వండి. రెగ్యూలర్‌గా పిల్లలకు వైద్యులకు చెకప్ చేయిస్తుండాలి. కొందరు పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ నచ్చదు. అలాంటప్పుడు వైద్యుల సూచనలు పాటిస్తూ.. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: