ఈ బుడతోడి పేరు తనీష్. ఈ పిల్లవాడు జలంధర్ ప్రాంతానికి చెందిన వారు. 5 సంవత్సరాల క్రితం ఇనోవెబ్స్ అనే ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. అయితే తనీష్ కి చిన్నతనం నుంచే కంప్యూటర్ అంటే మక్కువగా ఉండడంతో.. వాళ్ల తండ్రి దగ్గర ఉండేటువంటి కంప్యూటర్ మీదే ఎక్కువగా పని చేసేవారు. అంతే కాకుండా తన తండ్రి దగ్గర ఉంటూనే కొన్ని విషయాలను కూడా తెలుసుకునే వారు తనిష్. అలా టెక్నాలజీ మీద బాగా ఇష్టం పెరగడంతో.. తన తండ్రి నితిన్ కు తెలియజేయడం జరిగింది.తండ్రి కూడా తనకు తెలిసిన విధంగా.. తనీష్ కు కొన్ని బేసిక్స్ నేర్పించారు. అప్పుడు తన వయసు కేవలం ఆరు సంవత్సరాలే.
తనీష్ 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి నెట్ లో సెర్చింగ్ చేయడం మొదలు పెట్టేసాడు.. తనకు సంబంధించిన యానిమేషన్, వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్ మరికొన్ని వెబ్ డిజైన్ లు వంటివి నేర్చుకున్నాడు. ఇక తన తండ్రి తన ప్రతిభను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక దాంతో తన చదువుకి గుడ్బై చెప్పేశాడు తనీష్. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇనోవెబ్స్ టెక్ అనే ఒక కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం అతని దగ్గర 500 మంది క్లయింట్లు ఉన్నట్లు సమాచారం. వీరందరికీ తనకి తెలిసిన వెబ్ డెవలప్మెంట్, విజువల్ ఎఫెక్ట్స్ ,సైబర్ సెక్యూరిటీ తో పలు సేవలు అందిస్తున్నారు.ఇక బుడతోడి గురించి అక్కడ ఉండే స్కూల్లో స్పీచ్ లు కూడా ఇవ్వడం మొదలు పెట్టారట. ఇలాగే తను కూడా పైకి ఎదగాలని మనం కోరుకుందాం.