పలక బలపం తీసుకోని బడికి పోయే వయసులోనూ అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే వయసులో చాలా మంది పిల్లలు తెలిసీ తెలియక చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి.. ఎంతో మంది పిల్లలను మనం చూస్తూనే ఉంటాము. ఉదాహరణకు కొంత మంది చిన్నారులు ముక్కులో చిన్న పెన్సిల్, బలపం లాంటిది పెట్టుకొని అది లోపలికి వెళ్లేలా పీల్చడం.. తర్వాత ఏడ్వడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది పిల్లలు అయితే నాణేలను నోట్లో పెట్టుకుని మింగుతూ గొంతులో ఇరుక్కుని బాధపడుతూ ఉంటారు. అంతేకాదు చిన్న చిన్న గోలీలను కూడా గొంతులో వేసుకోవడం వల్ల అది గొంతులో ఇరుక్కుపోయి బయటకు రాక నొప్పితో ఏడుస్తూ ఉంటారు.


తప్పకుండా గొంతులో ఇరుక్కునే చిన్న వస్తువులు చాలానే ఉంటాయి.. చిన్న పిల్లల గొంతులో ఆహారం  ఒకవేళ ఇరుక్కుంటే పొర  పోయిందంటూ ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు కొంత సేపు బాధ గా ఉండి అది బయటకు తన్నేసినట్లు గా ఒక్కోసారి ముక్కులో నుంచి కూడా ఆహారం బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గొంతులో ఇరుక్కుంటే వస్తువులను బయటకు ఎలా తీయాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి.. మనం చేయాల్సిన ప్రథమ చికిత్స అనే విషయాలను తెలుసుకుందాం. ముక్కు , నోరు ఈ రెండింటికీ మధ్య కొంత దూరం వున్నప్పటికీ రెండింటి మార్గం ఇప్పుడు ఒకటే ఉంటుంది.


ఒకవేళ నాలుగేళ్ల లోపు పిల్లలకు గొంతులో ఇరుక్కు పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..క్యారెట్, చాక్లెట్స్,పెద్దగా ఉండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ వాటిని పెట్టాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా లేదా తురిమి పిల్లలకు ఇవ్వాలి.పిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు.. వాటిని పిల్లలు విరగొట్టడం సర్వ సాధారణం.. పిల్లలకు ఎక్కువగా పెద్దగా ఉండే బొమ్మలు మాత్రమే ఇవ్వాలి. పిల్లలకు ఏదైనా గొంతులో ఇరుక్కున్నప్పుడు గట్టిగా దగ్గడం, ఏడవడం, గట్టిగా మాట్లాడడం చేయమని చెప్పండి. ఇకపోతే వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికిపైగా ఉన్నప్పుడు వారికి హీమ్ లిచ్ మెనోవర్ అనే ప్రథమ చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుంది.

ఇక మనం కుర్చీలో కూర్చుని పిల్లలను మన కాళ్ళ పై బోర్లా పడుకో బెట్టుకోవాలి. తల బోర్లా వైపుకు ఉండేలా చేసుకొని చేతులతో వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగిస్తే నోట్లో ఉన్నది వెంటనే కిందకు వచ్చేస్తుంది. ఇది చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: