సాదరణంగా పిల్లలకు ప్యాన్ కేక్స్, వేఫీల్స్ బ్రేక్ ఫాస్ట్ ఛాంపియన్లని చెప్పాలని అన్నారు. ఇక రుచి విషయానికి వస్తే.. ముందుగా ఇందులో పిండి, ఓట్స్ కలిపిన మైదాతో తయారు చేస్తుంటారు. అయితే ఇవి తినడం వలన బలవర్ధకంగా మార్చుకోవడానికి ఇందులో తేనె, బెల్లం, అరటిపండ్లు, కోకోవా పౌడర్ వాడితే పిల్లలు కూడా మరింత ఇష్టపడి తింటుంటారు.
అలాగే క్వినోవా ఉప్మా కూడా పిల్లలకి మంచి వెజిటేబుల్ బ్రేక్ ఫాస్ట్ అని చెబుతుంటారు. అయితే అందులో వాడే ఉప్మారవ్వ బదులుగా క్వినోవా జత చేసి ఇవ్వడం వలన చాలా మంచిది. ఇక అందులో అత్యధికంగా ప్రోటీన్స్, ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇక పిల్లలకలు పీనట్ బట్టర్, టోస్ట్ కాంబోను ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో తీపి కోసం అరటిపండ్లను ఉపయోగించాలి. అలాగే వీటిని మరింత క్రంచ్ కోసం కొంత మేర తేనె లేదా చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ రెసిపీల్లో ఇదే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న బెస్ట్ రెసిపీ ఇడ్లీ. ఇది ఆల్ టైం ఫెవరేట్ బ్రేక్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇక ఓట్స్ తో చేసిన ఇడ్లీని పప్పుతో కలిపి తీసుకుంటే అదనంగా ఫైబర్, ప్రోటీన్స్, మంచి శక్తి లభిస్తుంది.