కప్ప విచారం చూసిన ఎలుక దిగులు చెందవద్దు. నేను నీకు స్నేహితుడిగా ఉంటాను. నువ్వు నాతో సమయం గడపాలనుకున్నప్పుడు నా బిలం దగ్గరకు రావచ్చు" అని చెప్పింది. ఎలుక మాటలు విన్న కప్ప చాలా సంతోషించింది. ఆ రోజు తర్వాత ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరూ రిజర్వాయర్ ఒడ్డున గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు కప్ప చాలా సంతోషంగా ఉంది.
ఒకరోజు కప్ప “ఈ తాడు రెండు చివరలను మన పాదాలకు కట్టుకుందాం. నేను నిన్ను మిస్ అయినప్పుడల్లా తాడు లాగుతాను. నీకు తెలుస్తుంది" అని చెప్పగా, ఎలుక దానికి అంగీకరించింది. అనుకున్నట్టుగానే ఇద్దరూ పాదాలకు తాడును కట్టుకున్నారు. ఆకాశంలో ఎగిరే డేగ ఇదంతా చూస్తూనే ఉంది. ఎలుకను తన ఆహారంగా మార్చుకోవడానికి దానిపైకి దూసుకెళ్లింది. అది చూసి భయపడిన కప్ప తన ప్రాణాలను కాపాడుకోవడానికి రిజర్వాయర్‌లోకి దూకింది. కానీ హడావుడిగా తాడు మరో చివర తన స్నేహితుడు ఎలుక కాలికి కట్ట ఉందనే విషయం మర్చిపోయింది. ఇంకేముంది కప్ప వల్ల ఎలుక కూడా నీటిలో మునిగిపోయి చనిపోయింది.
కొంచం సేపటి తర్వాత ఎలుక మృతదేహం రిజర్వాయర్ ఉపరితలంపై తేలడం ప్రారంభించింది. అది చూసి గద్ద నీటిలో తేలియాడుతున్న ఎలుక కళేబరాన్ని దాని పాదాలలో పట్టేసుకుంది. తాడు మరో చివర కప్ప కాలికి కట్టబడి ఉండడంతో అది కుల గడ్డకు ఆహారం అయిపొయింది.
నీతి : మూర్ఖుడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు.