పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల ఆరోగ్య విషయంలో ఎదుగుదలకు నిద్ర చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కంటి నిండా నిద్ర అవసరం అని చెబుతున్నారు. అయితే 3 -5 సంవత్సరాల వయస్సు పిల్లలకు 10 -13 గంటల నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు. అలాగే 6-12 ఏళ్ల పిల్లలకు 9 -11 గంటల నిద్ర అవసరం అని తెలిపారు. అయితే 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు కనీసం 7 -9 గంటల నిద్ర అవసరం అని అన్నారు.

సాధారణంగా పిల్లలు త్వరగా నిద్రపోవడానికి ఇష్టపోరు. సహజంగా పిల్లలు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. దానికి ప్రధాన కారణం తరచూ ఇళ్లు మారడం, ఇంట్లో ఇబ్బందులు, పాఠశాలకు వెళ్లే తొలినాళ్లలో సమస్యలు వస్తుంటాయని పేర్కొన్నారు. అలా అనేక కారణాల కారణంగా పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోతారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలు, పెద్దలు నిద్రపోకపోవడానికి ప్రధాన కారణం మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంటి వస్తువులు. ఇక చాలా మంది పిల్లలు మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, షోలు, సోషల్ మీడియా మితిమీరిన వినియోగం కారణంగా తమ నిద్రను అదుపులో ఉంచుకుంటారు.

అంతేకాదు.. పిల్లలు, పెద్దలు ఒకే సమయంలో నిద్రించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం మంచిదేనన్నారు. అయితే పిల్లలు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకాలు చదవడం వంటివి ప్రాక్టీస్ చేస్తుండాలి. అలా చేయడం వలన పిల్లలు నిద్ర పుచ్చడానికి దోహదపడుతుంది.

పిల్లలు పడుకునే ముందు టీవీ చూడవద్దు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు, వీడియో గేమ్‌లు వంటివి ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడకుండా చూసుకోవాలి. సాధారణంగా పిల్లలు నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉంటే నిద్ర ఉత్తమం అని చెబుతున్నారు. ఇక పిల్లలు నిద్రవేళలో పూర్తిగా చీకటిగా ఉండకుండా రాత్రి లైట్లను ఉపయోగించాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: