మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అయితే వారి ఎదుగదల కోసం, ఆరోగ్యం కోసం ఈ సూచనలు తప్పనిసరి అంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. అందుకే వీరిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ముఖ్యంగా పిల్లల్ని కన్నా తల్లితండ్రుల బాధ్యత. మనం పిల్లల పట్ల తీసుకునే ఆహార జాగ్రత్తలే వారి ఎదుగదలను , ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి అంటున్నారు.  ముఖ్యంగా చిన్న పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక ఆహారం పెట్టి వారి కడుపు నింపడం కాదు ఆరోగ్యంగా ఉంచడం అవసరం. అందుకోసం కొన్ని ఆహారపు అలవాట్లను పిల్లలో పెంపొందించాలి.
 
పప్పు - అన్నం: పప్పులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. పప్పు, బియ్యంతో కలిపి వండే భోజనం చాలా ఆరోగ్యకరం.  ఈ వంటకాన్ని పిల్లలు తినడానికి ఇష్టపడతారు అలాగే ఎంతో ఆరోగ్యం కూడా.. ఇందులో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, కార్బోహైడ్రేట్స్‌ పిల్లల ఎదుగుదలకు మానసిక వికాసానికి దోహదపడతాయి.

 పెరుగు : మీ పిల్లల రోజువారీ ఆహారంలో పెరుగు ఉండేలా చూడండి. ఇందులో అధికంగా ఉండే విటమిన్స్‌, కాల్షియం, ప్రొబయోటిక్స్‌, ప్రొటీన్స్‌ జీర్ణక్రియ మెరుగ్గా ఉంచడానికి, ఎముకలను, దంతాలను బలంగా ఉండటానికి దోహద పడుతుంది. అలాగే శరీరానికి మంచి చలువ కూడా.

సీజనల్‌గా దొరికే పండ్లను పిల్లలకు ఇవ్వడం ఉత్తమం.  చక్కెర కలపకుండా తాజా పండ్లను రసాల ను కానీ నేరుగా పండ్లను కానీ పిల్లలకు ఇవ్వండి. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్స్‌  పిల్లల మానసిక వికాసానికి అలాగే వారి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

సూప్స్ : రకరకాల కూరగాయలతో పిల్లలకు సూప్స్ ఇవ్వడం ద్వారా కూడా వారు ఆరోగ్యంగా ఉంటారు.

పైన చెప్పిన విధంగా పిల్లలకు ఆహారాన్ని అందిస్తే వారు ఆరోగ్యంగా వయసు ప్రకారం పెరుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: