
1. పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యంగా అస్సలు ఉండకూడదు. లేదంటే వారు కూడా క్రమ శిక్షణ లేకుండా పెరుగుతారు. చిన్న తనం నుండి వారికి ఏమీ తెలియదు. కాబట్టి చుట్టూ ఉన్న వారిని చూస్తూనే పెరుగుతారు. అలా ఎదుటి వారు చేసే పనులు పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. అలాగే చెడు మాటలు, తప్పుడు పదాలు మాట్లాడకూడదు. లేదంటే మనలని చూసి వారు నేర్చుకుని అవే మాటలను మాట్లాడుతారు. వాటిని మాట్లాడినా తప్పని అస్సలు ఫీల్ అవరు.
2. పిల్లల ముందు అబద్ధాలు చెప్పరాదు. అబద్దం చెప్పడం వలన ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలిసిందే. అందుకే వారితోనూ చెప్పకండి. లేదంటే అబద్దం చెప్పడం తప్పు కాదని భావించి పరిపాటిగా భావిస్తారు.
3. పిల్లల ముందు ఇతరులను అవమానించడం కూడా పెద్ద పొరపాటే. ఇక పిల్లల ముందు వేరొకరిని తక్కువ చేసి మాట్లాడడం వలన పిల్లలు చులకన భావం ఏర్పడుతుంది.
5. పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తించడం కూడా చాలా చాలా పెద్ద తప్పు. అలా చేయడం వలన వారు కూడా
అలానే అనుకరించే అవకాశం ఉంది.
ఇవి కాకుండా ఎప్పటిలాగే మన పిల్లలు మంచి పద్దతిలో పెరగడానికి అవసరం అయిన అన్ని పద్దతులను వారికి నేర్పించాలి.