" తూరుపు దిక్కున తన కూనల భవిష్యత్ గురించి బాధతో ఉంటుంది పులి.

ఉత్తరాన కరుగుతున్న హిమనీనదాల గురించి భయపడుతుంది తెల్ల ఎలుగు బంటి.

పశ్చిమాన తను పెట్టిన గుడ్ల భవిత్యం తో వేదనా భరితమౌతుంది పక్షి.

దక్షిణాన తన పిల్లల భవిష్యత్ కోసం వేదనాభరిత గీతం పాడుతుంది తిమింగలం



'మెడోరా షెవాలియర్'  ఎప్పుడో రాసిన కవితను చదివి  "ఇప్పటికైనా కలలు కనేవారు మేల్కుంటారా?"  మనల్ని ప్రశ్నిస్తున్నాడు.

ఆ కవి మనవడు. పర్యావరణ పరిరక్షణ గురించి.



ఏడాదికి 48 పౌండ్ల కార్బండయాక్సైడ్ ని  తీసుకుని ‘భూ ఉపరితల తాపాన్ని’తగ్గిస్తుంది - ఒక వృక్షం.

సూర్యతాపానికి తానే తెర లా మారి మనకు నీడై నిలుస్తుంది - ఒక వృక్షం.

భవిష్యత్ తరాలకు నీడనివ్వటానికి  నాటండి ఇప్పుడు-కల్పవృక్షాలను

సంతానం లేని దంపతులకు ఉండదు  "ఆశావహ  భవిష్యత్"

నిర్మల వనాలు, జలాలు, పవనాలు లేని దేశానికి  -"అవసరము ఉండనిదే భవిష్యత్"

 

మేము అనుభవించిన ప్రకృతి ప్రయొజనాల గేయగీతికలు



పచ్చని పచ్చదనం కనుదోయికిచ్చే పరవశం

మెత్తైన మారుతం  మాగిన మేనికి మధురం

మానుల మాటున నునువెచ్చని రవికిరణం

ప్రకృతికాంత మోముపై చిలికరించె స్వేద

 

కొండా కోనల చెట్లు పుట్టల చెలిమి

చెట్టూ చేమల చక్కదనం కానకు కలిమి

పరచిన పొరల పచ్చికే  పుడమికి బలిమి

కాయకష్టమే గూడెం గుండెల బలిమి

 

జాలువారే సెలయేళ్ళ గలగల

రివ్వున వీచే చిరుగాలి కిలకిల

మత్తకోయిల స్వరాన సాగే రసహేల

రస హృదయాల  జ్వలించె మధుకీల


 


చెలమల  జల ఊట రుచి మధుమధురం

కొలమల  తుంపరల  తను  స్పర్శే రసభరితం

కనుమల వంపు సొంపుల సొగసే మదిన మౌనగీతం

తరువుల  కోనకి పుడమి తల్లి అల్లిన కోకే పచ్చదనం

 

చటుక్కున తుళ్ళిపడే పక్షుల కిలకిలారావాలు

పుటుక్కున విరిగిపడే ఎండిన కొమ్మల పెళపెళా రావాలు

దబుక్కున దూకిపడే సెలయేళ్ళ గలగలారావాలు

చెమక్కున  వెన్నెల వెలుగులు చిమ్మే మిలమిలారావాలు

 

కొండకోనలు  వెండిమబ్బులు

కొన వంపులు కొమ్మ సొగసులు

చల్ల గాలులు  నెగళ్ళ  వెలుగులు

కొమ్మ స్పర్శలు కౌగిళ్ళ పొందులు.


 


మానుల  పై పరచిన  నీరెండ వెచ్చదనం   

గుబురు పొదల పై విరిచిన  వెన్నెలసిరి  తెల్లదనం

ఒడలు ఝల్లనే  తరు తనువుల పచ్చదనం

మెల్లి మెల్లన వీచే పిల్ల తెమ్మెరల  చల్లదనం


మీరు ఇప్పుడు ప్రకృతిని పరిరక్షించపోతే మీకు మిగిలేది గ్లోబల్ వార్మింగ్ తో శిధిల నిశీధ ప్రకృతి. కాంక్రీట్ మహారణ్యాలు, విశ్వనగరాలు ప్రకృతిని చంపేస్తాయి. ఫలితంగా భూవాతావరణం వేడెక్కి భూకంపాలు, వరదలు, జల ప్రళయాలు, కొత్త జబ్బులు మానవజాతి హననం తప్పదు.....అవసరమైతే ప్రభుత్వాలతో పోరాడి ఉద్యమాలు నిర్మించి ప్రకృతిని కాపాడటం చాలా అవసరం.    


మోడులైన బీడు భూములే మన సంపదలిప్పుడు

కాంక్రీట్ కీకారణ్యాలే మన కాలపు హరితవనాలు

అడవులు, సెలయేళ్ళు నిలిచాయిప్పుదు మధుర భావనలై

అలవాటవ్వాలి మొక్కల పెంపకం ఆ దైవం దీవనలై

మరింత సమాచారం తెలుసుకోండి: