ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో పక్కన పడుకున్నవారు గురక పెడితే అది మన నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనితో మన నిద్రకు భంగం కలిగి మరునాడు ఉదయం మనం చాలా అలసటగా ఉంటాము. అయితే అసలు గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయంలో ఈమధ్య జరిగిన పరిశోధనలలో అనేక సూచనలు బయట పడ్డాయి.


 ఈ టిప్స్ పాటిస్తే చాలు ఎవరైనా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఏవ్యక్తి అయినా నిద్రపోయే ముందు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు రెండింటిని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా కలుపుకుని రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించి ఊస్తే ఈ గురక సమస్య నుండి బయట పడవచ్చు అని అంటున్నారు.


 అదేవిధంగా కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతులకు రాసుకుని వాసన చూసినా గురక సమస్య తగ్గుతుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా తేనె, ఆలివ్ ఆయిల్‌లను 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకుని రెండింటినీ కలిపి దీన్ని నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 


 మరిగే నీటిలో నాలుగు నుంచి ఐదు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసిన అనంతరం వచ్చే ఆవిరిని రాత్రి పడుకునే ముందు పట్టాలి ఇలా చేసినా కూడ ఈ గురక సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా తీసుకోవడం కూడ కష్టం అనుకుంటే ఒక గ్లాసు వేడి నీటిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్య తొలగిపోతుంది. ఏమైనా మన పక్కన నిద్రపోయే వారికి ఎంతో అసౌకర్యాన్ని కలిగించే ఈ గురక విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ మంచిది..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: