అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 
Image result for అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా!
*తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

*బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.

Image result for విస్తరాకు


*టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

Image result for టేకు ఆకు


1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.


2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 


పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది

కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు...

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.
Image result for అన్నం

ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.

ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.

భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం.

Related image


భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు...

మరింత సమాచారం తెలుసుకోండి: