మనసరీరంలోని రక్తం నుండి వ్యర్థ పదార్ధాలను తొలగించడానికి మరియు శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడానికి మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం మనదేశంలో అనేకమంది తమ వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలతో సతమవుతున్నారు. మనం రోజు తీసునే ఆహారంలో ఈకూరలతో చేసిన పదార్ధాలు తీసుకుంటే కిడ్నీ సమస్యల నుండి బయటపడవచ్చని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేతున్నాయి.
ముఖ్య గా ఎరుపు రంగు క్యాప్సికంలో పొటాషియం తక్కువగా ఉన్నందున మూత్రపిండాలకు అనుకూలమైన కూరగాయగా చెప్పబడుతుంది. రక్తంలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటే దానిని తొలగించడం మూత్రపిండాలకు కష్టతరమవుతుంది. ఇది దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. ఎరుపు క్యాప్సికంలో విటమిన్ సి, ఏ మరియు బి6 వంటి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు మరియు ఫోలిక్ ఆమ్లం, పీచుపదార్ధం వంటి ఇతర పోషకాలు ఉన్న నేపద్యంలో కిడ్నీ ఆరోగ్యానికి ఈఎరుపు రంగు క్యాప్స్ కమ్ ఎంతగానో సహకరిస్తుంది.
అదేవిధంగా క్యాబేజీలనను తీసుకుంటే మన కాలేయానికి మరియు మూత్రపిండాలకు చేటు చేసే పొటాషియం నుండి రక్షించుకోవచ్చు. వీటి తరువాత ప్రముఖ స్థానంలో పేర్కొన వలసింది వెల్లుల్లి. దీనిని ఆహార పదార్థాల తయారీలో బాగా ఉపయోగిస్తే మూత్రపిండాల సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక కాలీఫ్లవర్ కూడ మూత్రపిండాల ఆరోగ్యానికి అనుకూలంగా వుండే అద్భుతమైన కూరగాయ.
ఈ కాలీఫ్లవర్ వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటాన్ని నిరోధించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మూత్రపిండాల్లో కణచర్యను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి బాగా సహకరించే మరొక క్రూసిఫెరస్ కూరగాయ. ఇది తక్కువ పొటాషియం ఉన్న ఆహార పదార్ధంగా పరిగణించబడుతున్న నేపధ్యంలో నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఈ కూరను బాగా వాడమని సలహాలు ఇస్తున్నారు. ఇలా పలురకాలైన ఈకూరలను బాగా తింటే చాల వరకు కిడ్నీ సమస్యలనుండి బయట పడవచ్చు..