భారతదేశంలో ప్రతి సంవత్సరం
నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో 1956లో భారత తొలి
ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966
నవంబర్ 16 వ తేదిన
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరుకు ప్రతి సంవత్సరం
నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకోవడం సర్వ సాధారణంగా మారింది.
ఒక దేశములో ప్రజాస్వామ్యము సక్రమముగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు అని చాల మంది భావన. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్య్రం అమలవుతుందంటే ఆ దేశము లో ప్రజాస్వామ్య పాలనకు ఎటువంటి ఇబ్బందులు లేవు అనే చెప్పాలి. ఎప్పటికైనా పత్రికా స్వేచ్ఛ కోసంమే పని చేయాలనీ అన్నదే ముఖ్య లక్షణం.
ఇక ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్ కౌన్సిళ్లు కూడా ఉన్నాయి అంతే నమ్మండి. అయితే మన దేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. పత్రికలు,
మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్ కౌన్సిల్ అందరిని ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తుంది.
గత 12 సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి
అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది.