కొన్ని విచిత్రమైన ఘటనలు వింటుంటే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా మన ఊహకు అందని విధంగా జరిగే ఏ విషయాన్నయినా విచిత్ర ఘటన అనే అంటాము. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటి ఘటనే అనే చెప్పకతప్పదు. ఇటీవల అమెరికా దేశంలోని అరిజోన రాష్ట్రంలో గల మిసా నగరంలో బ్యానర్ డిజర్ట్ అనే ప్రముఖ ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుల్లో ఏకంగా 16మంది నర్సులు ఒకేసారి గర్భం దాల్చిన ఘటన ఆసుపత్రి సహా ఆ నగరంలోని వారందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కొంత యాదృచ్చికమే అయినప్పటికీ కూడా, ప్రతిఒక్కరు నమ్మక తప్పని నిజం. 

అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, వీరిలో చాలామందికి నిన్నమొన్నటివరకు, వారందరూ కేవలం కొంత వ్యవధి తేడాలో తల్లికాబోతున్నాం అనే విషయం తెలియకపోవడం. అయితే వీరందరికి ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉండడం, అందరూ కలిసి ఇటీవల తమ ప్రెగ్నెన్సీకి సంబంధించి డెలివరీ డేట్స్ విషయమై ఒకరికొకరు సమాచారం పంచుకున్నపుడు ఈ విచిత్రం బయటపడిందట. కాగా ఆ ఘటనను తెలుసుకున్న ఆ నర్సులందరూ కూడా తొలుత తమకు తామే ఎంతో ఆశ్చర్యపోయారట. ఇక ఒక్కసారిగా 16మంది నర్సులు తల్లికాబోతున్న విషయం తెలియడంతో, ఆసుపత్రి సిబ్బంది రోగులకు ఆ సమయంలో వైద్యసేవలకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడానికి సిద్దమయిందట. 

ఇక వీరందరూ రాబోయే జనవరి నుండి మార్చి మధ్యలోనే తల్లులు కానుండడంతో, ఆ సమయంలో తాత్కాలిక సిబ్బంది కావాలని త్వరలోనే తమ ఆసుపత్రి తరపున ప్రకటన జారీ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఇక ఆసుపత్రికి వస్తున్న రోగులు సైతం నర్శుల గర్భం విషయం తెలిసి కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఇక వారి ఘటనపై ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ, అలా 16 మంది నర్సులు ఒకేసారి తల్లికావడం పూర్తిగా యాదృచ్చికమని, కావున వారి స్థానే ఇతర సిబ్బందిని తీసుకోవడం జరుగుతోందని రోగులకు వివరిస్తున్నారట. కాగా ఈ ఘటన మిసా నగరం సహా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎంతో వైరల్ గా మారింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: