మనం ఏదైనా విహార యాత్రలకు కాని దైవ దర్శనాలకు కాని లేదా ఫ్యామిలీ వెకేషన్ కాని వెళ్ళినప్పుడు హోటల్స్ ను మన బడ్జెట్ లో వెతుక్కోవడం కొంచెం కష్టమే. కాని జపాన్ కు చెందిన ఒక హోటల్ మాత్రం తన కస్టమర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ హోటల్లో ఒక రాత్రికి కేవలం 100 యెన్స్ (జపాన్ కరెన్సీ) ను మాత్రమే తీసుకుంటున్నారు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం.
జపాన్‌లో ఉన్న అసాహి ర్యోకన్ అనే హోటల్ నిర్వాహకులు మాత్రం చాలా తక్కువ ధరలో గదిని ఇస్తుండటం విశేషం. ఆ హోటల్లో ఒక రోజు రాత్రి బస చేయాలంటే కేవలం 100 యెన్స్ (సుమారు రూ.66) చెల్లిస్తే సరిపోతుంది. సౌకర్యాల అందించే విషయంలోనూ వారు ఏమాత్రం వెనకడుగు వేయరు. గదిలో నిద్రపోవటానికి చాప, టీవి, చిన్న టేబుల్ వంటి చక్కటి సదుపాయాలు ఉంటాయి. కానీ ఆ హోటల్లో బస చేసేందుకు ఒక చిన్న నిబంధన పాటించాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఆ రాత్రి మొత్తం మీ బసని లైవ్స్ట్రీం చేసేందుకు అంగీకరించాలి. హోటల్లో ఉన్న సమయంలో ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, బాత్రూమ్కి వెళ్లేప్పుడు మాత్రం వీడియోలో రికార్డు చేయరు. మన ప్రైవసీ కి పూర్తి స్వేచ్ఛ ని ఇస్తారు.
టెట్సుయా ఇనోయీ అనే వ్యక్తికి వచ్చింది. అతని బామ్మకు చెందిన ఈ హోటల్లో కొద్ది రోజుల క్రితం ఓ బ్రిటిష్ యూట్యూబర్‌కి గది అద్దెకు ఇచ్చారు. అతను హోటల్లో బస మొత్తాన్ని లైవ్‌స్ట్రీమ్ చేయటంతో, ఇనోయీ కూడా తన హోటల్‌కు వచ్చే అతిథులకు ఈ తరహా ఆఫర్‌ను ప్రకటిస్తున్నారు. ఇక ఈ “వన్ డాలర్ హోటల్” గదికి ఇతర జాగ్రత్తలు ఉన్నాయి. అతిథులు పాస్‌పోర్ట్‌లు మరియు క్రెడిట్ కార్డ్ నంబర్లు వంటి ప్రైవేటు సమాచారాన్ని సీసీ కెమెరాల కళ్ళ నుంచి దాచి ఉంచాలని పేర్కొంది.