ప్రస్తుత రోజులలో వ్యాయామం, ఫిట్ నెస్ కోసం చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం ఎవరికైనా ఆరోగ్యకరమే అని నిపుణులు తెలుపుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు వ్యాయామం అత్యవసరం. పెరిగి తరిగే హార్మోన్ల ప్రభావాలు, అదుపుతప్పుతున్న ఆహారపుటల వాట్లు, జీవనశైలులు, మారే సీజన్లు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి టీనేజర్ల మొదలు, వృద్ధుల వరకూ ప్రతి మహిళా తమకు తగిన ఎంతో కొంత వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. అయితే ఏ ఇద్దరి జన్యు నిర్మాణం ఒకేలా ఉండదు. కాబట్టి ఒకరికి ఫలితాన్నిచ్చిన వ్యాయామం వేరొకరికి ఇవ్వకపోవచ్చు. ఒకరికి తేలికగా అనిపించిన వ్యాయామం ఇంకొకరికి కష్టంగా తోచవచ్చు. అలాంటప్పుడు ఎవరికి వాళ్లు తమకు తగిన వ్యాయామాన్ని ఎలా ఎంచుకోవాలి? అయితే ఈ వ్యాయామాలు ఏ ప్రాతిపదికన, ఏ అంశాల ఆధారంగా వ్యాయామ నియమాల్ని పాటించాలి అనే విషయాలు తెలుసుకుందామా మరి...
ఇలా వ్యాయామంలో ఏరోబిక్స్ కూడా చాల ముఖ్యమైనది... ఏ వ్యాయామానికైనా ప్రధాన ఉద్దేశ్యం ప్రొటీన్‌ని పెంచి కొవ్వును తగ్గించడమే ముఖ్యమైన ఉద్దేశం. ఏరోబిక్స్ సూత్రం కూడా అదే.. ఈ వ్యాయామంతో కండరాలన్నీ పని చేయడం మొదలుపెడతాయి. దాంతో శక్తి ఖర్చవుతుంది. తీసుకునే మాంసకృత్తుల సహాయంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల కీళ్లను పట్టి ఉంచే లిగమెంట్లు సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ ఒత్తిడి పడని టోనింగ్, బిల్డింగ్ వ్యాయామాలు మహిళలకు అనుకూలమైనవి. కొవ్వును కరిగించి, కండరాల పటుత్వాన్ని పెంచడం ఈ వ్యాయామాల ముఖ్య ఉద్దేశం.
ఇలాంటి ఒకే ఒక్క వ్యాయామం ‘ఏరోబిక్స్’. ఏరోబిక్స్ అనగానే సాధారణంగా మహిళలందరూ జంకుతూ ఉండడం సర్వ సాధారణం. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడమే తేలిక అనుకుంటూ ఉంటారు. కానీ ఏరోబిక్స్ కీళ్ల సమస్యలు లేని ఏ వయసు గల వారు ఐనా కూడా చేయవచ్చు. నిజానికి ఈ ఏరోబిక్స్ వ్యాయామాలు వయసుల వారీగా కూడా ఉంటాయి.