చాయ్ వాలా... ఇప్పుడు దీని గురినిచి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని కారణం.. మన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీనే. అయన తన జీవనాన్ని మొదట్లో చాయ్ వాలా గా జీవితం ప్రారంభించి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. దేశంలో చాలా మంది ప్రధాని అంత కాకపోయినా ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు సైతం ‘చాయ్’ ను నమ్ముకుని రూ.లక్షల్లో వారు లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఆయా వ్యక్తుల గురించి ఇప్పుడు ఒక లుక్ చూద్దామా...!
ముందుగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రఘువీర్ గురించి తెలుసుకుందాము. అయన ప్రస్తుతం టీ అమ్మకంలో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. జైపూర్ లోని శివారులో ఓ గ్రామంలో జన్మించిన రఘువీర్, బాగా చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని అనుకునేవాడు. కానీ, తన ఆర్థిక ఇబ్బందుల వల్ల అతడి కల నెరవేరలేదు. చివరికి తాను పదో తరగతి వరకే చదివి కూలి పనులకు వెళ్లేవాడు. సరైన ఆదాయం రాకపోవడంతో రఘువీర్ మొదట అమెజాన్ కంపెనీలో డెలివరీ బాయ్ గా చేరాడు. రఘువీర్ డెలవరీకి వెళ్లేప్పుడు కొందరు అతడిని స్నాక్స్, టీ తీసుకురావాలని కోరేవారు. దీనితో రఘువీర్ ఉద్యోగం మానేసి టీ, స్నాక్స్ డెలవరీ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అయన రూ.20 వేలు పెట్టుబడితో ‘టీ’ హోం డెలవరీలను ప్రారంభించాడు. ఆర్డర్లు పెరగడంతో సొంతంగా ఒక షాప్ తెరిచాడు. ఇప్పుడు అయన రోజుకు 800 పైగా ఆర్డర్లు వస్తున్నాయి. రఘువీర్ కు నెలకు లక్ష రూపాయల పైనే ఆదాయం వస్తోంది. అతను ఇల్లు కట్టి, తన తమ్ముడు, చెల్లిని తాను సంపాదించిన దానిలోనే చదివిస్తున్నాడు.
అలాగే ఇంకా మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో అప్పా బల్వంత్ చౌక్ లో ఉన్న ‘యేవలే అమృతతుల్య’ టీహౌస్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. పురందర్ గ్రామానికి చెందిన నిలేశ్ పురందర్ ఈ టీ హౌస్ ని నిర్వహిస్తున్నాడు. వారి తండ్రి 1983లో ఆయన ఓక షాపు అద్దెకు తీసుకుని టీ స్టాల్ పెట్టారు. ఆయన మరణం తర్వాత కొడుకులు ఆ బాధ్యతని తీసుకున్నారు. మొదట్లో ఆ షాపు నడిపేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్నో రకాల టీలతో కస్టమర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నించి విఫలం చెందారు. దీనితో షాపు బల్వంత్ చౌక్ కు మార్చారు. ‘యేవలే అమృతతుల్య’ పేరుతో టీ హౌస్ ప్రారంభించారు. దీనికి ఆధరణ పెరగడంతో మరో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసి, ఇప్పుడు ఈ టీ స్టాల్స్ కు నెలకు రూ.12 లక్షల ఆదాయం వచ్చేలా వాళ్లు దాన్ని నడుపుతున్నారు.
ఇలా చాలామంది దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మన భారతీయుల చాయ్ వాలాలు చాలా మందే ఉన్నారు. ఎంతయినా పొద్దున్నే టీ తాగందే వారివారి పనులను ప్రారంబించరు అంటే మీరు నమ్ముతారా?