తెలుగు ఇంటి రుచులు అంటే గుర్తొచ్చేది ... పట్టెడు అన్నం అవకాయ..వింటే మహాభారతం వినాలి .. తింటే గారెలు తినాలి అంటూ పెద్దలు చెప్పిన సామెత తెలిసిందే.. ఇంకా మాముల సమయాల్లో కన్న పండుగల సమయాల్లో మాత్రం అసలు చెప్పనకకర్లేదు.. ప్రతి తెలుగు వాళ్ళు సంబరంగా జరుపునే పండుగా..ఒక్క సంక్రాంతి పండుగే..
ఇకపోతే సంక్రాంతి పండుగ వస్తె చాలు ఎలాంటి సంబరాలు సరదాలు అన్ని ఎక్కువే.. అందుకే సంవత్సరంలో ఒక్కరొస్తే ఎలా ఉందో చెప్పనక్కర్లదు.. అలాంటిది.. ఈ పండుగ గురించి వర్ణంచాలంటే ఒక్క రోజు ఛాలదేమో. రైతుల పంటలు అలా ఎన్నో ఉంటాయి.. కొత్త ఉరకలతో అన్ని ఆశలు తీరుతాయి.. ఇకపోతే ఈ పండుగ వస్తె పతంగులు అని అందరికీ తెలిసిన విషయం..
అన్నిటికంటే ముఖ్యమైనది అసలు సంక్రాంతి అనగానే హరిదాసులకు ప్రత్యేకం. కానీ నేడు వీరు గత చరిత్రలో దాదాపు కలిసిపోయారు. ఆదరించేవారు లేక.. అసలు జనాలే రాక.. అటు హరికి.. ఇటు దాసులకు కూడా పనిలేకుండా పోయింది. అన్నింటికి మించి సంక్రాంతికి ఉమ్మడి కుటుంబం అంతా పల్లెల్లో తమ ఇళ్లకే చేరుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మటు మాయం.. అసలు సంక్రాంతికి పబ్బులు, క్లబ్లులే..
ఇక ఈ సినిమాల విషయానికొస్తే అవి కూడా అంతే.. కుటుంబం పల్లె వాతావరణము అనేవి ఎక్కడా లేవని చెప్పాలి.. సిటీ కల్చర్ కు అలవాటు పడ్డ ఎవరైనా పల్లె వాతావరణానికి అనేది పూర్తిగా కనుమరుగు అయిందని చెప్పాలి.. యువత కూడా అంతే సిటీ లని తిరుగుతున్నారు తప్ప కుటుంబ విలువలు అనేవి పూర్తిగా మర్చిపోతారు.. అదండీ మన భారతీయ సంస్కృతిలో ఉండే కోణాలు.. ఇతర దేశాల వారు మన దేశాన్ని అందరూ గౌరవిస్తారు.. కానీ భారతీయుల మయిన మనం ఈ విధంగా గౌరవించాలి ఆలోచించండి.. ఈ పల్లెటూరు లను అభివృధి చేయండి...